ఇంటర్నేషనల్ గా మనది చెత్త మీడియా అట..

Update: 2017-01-23 10:23 GMT
ప్రస్తుతం దేశంలో మీడియా కార్పొరేట్ శక్తుల చేతిలో ఉంది. రాజకీయ పార్టీల పక్కలో ఉంది. ప్రజల పక్షాన గొంతెత్తాల్సిన మీడియా పాలకుల అరాచకాలకు వంత పాడుతోంది.  కాసుల కోసం అధికార పార్టీలకి భజన చేస్తూ తరిస్తోంది. ఈ నేపథ్యంలో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తరపున నిర్వహించిన సర్వేలో అసలు మీడియా గురించి దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో స్పష్టమైంది. ఈ సర్వే రిపోర్టును దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వెల్లడించారు.
    
ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో వరల్డ్ ఎకనమిక్ ఫోరం నిర్వహించిన సర్వేలో భారత దేశ మీడియా అత్యంత చెత్త మీడియాగా రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచంలోనే విశ్వసనీయత లేని మీడియాగా భారత దేశ మీడియా రెండోస్థానంలో నిలిచింది. ఈ విషయంలో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉంది. మీడియా సంస్థలు తమ అభిప్రాయం, తమ ప్రాధాన్యతలకు అనుగుణంగానే కథనాలు రాస్తున్నాయని చాలా మంది అభిప్రాయపడ్డారు.
    
సర్వేలో పాల్గొన్నవారిలో మెజారిటీ ప్రజలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మలేమని చెప్పారు. మొత్తం మీద ప్రపంచంలోనే విశ్వసనీయత లేని మీడియాగా మన దేశ మీడియా రెండో స్థానంలో నిలవడం బాధాకరమే. అయితే.. ఇండియన్ మీడియాకు ఇంటర్నేషనల్ గా చెత్త మీడియా అన్న గుర్తింపు రాగా.. ఇండియాలో కనుక లెక్కలు తీస్తే తెలుగు మీడియా ఇండియా లెవల్లో టాప్ లో నిలుస్తందని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News