ఆస్ట్రేలియాలో భారత లేడీ డాక్టర్ హత్య

Update: 2019-03-06 05:05 GMT
భారత సంతతికి చెందిన యువ వైద్యురాలు సిడ్నీలో దారుణ హత్యకు గురైంది. ఆమె డెడ్ బాడీని సిడ్నీలో నిలిపి ఉంచి కారులో సూట్ కేసులో పోలీసులు గుర్తించారు. ఆస్ట్రేలియాలో డెంటిస్ట్ గా ప్రీతిరెడ్డి (32) పనిచేస్తోంది. కొద్దిరోజులుగా అక్కడే నివాసం ఉంటోంది. ఆది వారం రాత్రి 2.15 గంటలకు ఆమె సిడ్నీలోని జార్జ్ స్ట్రీట్ లో ఉన్న మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కు వచ్చినట్టు సీసీ టీవీ రికార్డుల్లో నమోదైంది.  ఆ తర్వాత నుంచి కనిపించకుండా పోయింది. ఆమె ఫోన్ పనిచేయడం లేదు. ఇంటికి కూడా రాకపోవడంతో కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు సన్నిహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు..

తాజాగా  తూర్పు సిడ్నీలోని ఓ వీధిలో ఉన్న ఆమె కారులో ఉంచిన సూట్ కేసులో ఆమె మృతదేహాన్ని  పోలీసులు బుధవారం గుర్తించారు. ఆమె మాజీ ప్రియుడు కూడా రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. ఇది ఉద్వేశపూర్వకంగా జరిగిందా..? కుట్రకోణం ఉందా అనే విషయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

ప్రతీరెడ్డి మిస్సింగ్ పై అందిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన న్యూసౌత్ వేల్స్ పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. సిడ్నీ లోని జియార్జ్ వీధిలో ఉన్న మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ కు  రాత్రి 2.15 గంటలకు చివరి సారిగా ప్రీతిరెడ్డి వచ్చి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆమెను ఎవరైనా కిడ్నాప్ చేశారా.? ఎటువెళ్లిందనే దానిపై ఆరాతీశారు.

మంగళవారం రాత్రి పోలీసులు కింగ్స్ ఫోర్డ్ లోని స్ట్రాచన్ వద్ద కారును  పార్క్ చేసి ఉండడాన్ని గుర్తించారు. కారులో ప్రీతిరెడ్డి డెడ్ బాడీని కారులో ఓ సూట్ కేసులో కుక్కి ఉంచారు.

మృతదేహాన్ని బయటకు తీసి చూడగా.. ప్రీతిరెడ్డి శరీరంపై చాలా కత్తిపోట్లు కనిపించాయి. ఆమె మాజీ ప్రియుడే ఈ పనిచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దానికి దగ్గరలోనే ఆమె మాజీ ప్రియుడు సీబీడీ మార్కెట్ స్ట్రీట్ లోని ఓ హోటల్ లో బస చేసినట్లు పోలీసులు గుర్తించారు.

ప్రతీరెడ్డి  ఫోన్స్ కాల్స్ ను కూడా పోలీసులు పరిశీలించారు. సెయింట్ లీయోనార్డ్స్ లో వారంతపు డెంటల్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు వెళ్లేముందు ఆమె చివరి సారి గత ఆదివారం ఉదయం 11 గంటలకు ఇండియాలోని తన కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలిసింది. ఆ తర్వాత ఆమె నుంచి ఫోన్ రాకపోవడం.. ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కంగారు పడి, స్నేహితుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

పోలీసులు ఆమె డెడ్ బాడీని గుర్తించి హైదరాబాద్  లోని వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
   

Tags:    

Similar News