కరోనా బాదుడు.. ఆ స్టేషన్లలో ఫ్లాట్ ఫాం టికెట్ రూ.50

Update: 2021-03-03 04:30 GMT
కేంద్రంలో మోడీ సర్కారు కొలువు తీరితే చాలు.. రైల్వేల రూపురేఖలు మొత్తంగా మారిపోతాయని.. స్వర్ణయుగంగా మారుతుందన్న అంచనాలకు భిన్నంగా మొదటికే మోసం అన్నట్లుగా తీరు ఉండటం ఇప్పుడు పలువురిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో ఒక పోస్టు విపరీతంగా వైరల్ అవుతోంది. సక్సెస్ అంటే ఏమిటమ్మా అని ఒక పిల్లాడు తల్లిని అడిగితే.. ఏ రైల్వే స్టేషన్ లో అయితే టీ అమ్మారో.. అదే రైల్వే స్టేషన్ ను.. అలాంటి రైల్వేలను అమ్మేసే స్థాయికి చేరుకోవటం నాన్న అంటూ వేస్తున్న పంచ్ చూస్తే.. తాజాగా రైల్వేల పరిస్థితిని కళ్లకు కట్టేలా వేసిన పంచ్ గా చెప్పాలి.

రైల్వేలను ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతో మోడీ సర్కారు అనుసరిస్తున్న విధానాలు షాకింగ్ గా మారాయి. కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ తో రైలు ప్రయాణాలకు చెక్ చెప్పిన రైల్వేలు.. అన్ లాక్ తర్వాత రైళ్లను పట్టాల మీదకు ఎక్కించినా.. కొన్నింటినే కానీ అన్నింటిని ఇప్పటికి తీసుకొచ్చింది లేదు. అంతేకాదు.. కొన్ని స్టేషన్ల విషయంలో రైల్వే అధికారులు తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు షాకింగ్ గా మారుతున్నాయి.

దేశంలో కరోనా కేసుల నమోదు తగ్గుముఖం పట్టినా.. మహారాష్ట్ర మాత్రం అందుకు భిన్నంగా నేటికి కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉన్న పరిస్థితి. ఇదిలా ఉంటే.. రైల్వేస్టేషన్లలోరద్దీని తగ్గించేందుకు షాకింగ్ నిర్ణయాన్ని తీసుకున్నారు. ముంబయి మెట్రో పాలిటన్ రీజియన్ లోని కొన్ని రైల్వే స్టేషన్లలో ప్లాట్ ఫాం టికెట్ ను ఐదు రెట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.10 టికెట్ ను రూ.50లుగా చేశారు. కరోనా వేళ.. రద్దీని నియంత్రించేందుకే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.

అయితే.. అధికారులు మర్చిపోతున్న విషయం ఏమంటే.. ప్రయాణఛార్జీ కంటే కొన్ని రెట్లు ఎక్కువగా ఫ్లాట్ ఫాం టికెట్ ధరను పెంచితే.. జనం దానికి బదులుగా తక్కువ ధర ఉన్న ప్రయాణ టికెట్లు కొనుగోలు చేసి చూపిస్తే ఎవరు మాత్రం ఏమనగలరు? అయినా.. ఎంత కరోనా అయితే మాత్రం ఫ్లాట్ ఫాం టికెట్ ధర రూ.50కుపెంచటం మాత్రం సరికాదంటున్నారు.తాజాగా యాభై రూపాయిలకు ప్లాట్ ఫాం టికెట్ ధరను పెంచిన స్టేషన్ల విషయానికి వస్తే..
-  ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్‌ టెర్మినస్‌
-  దాదర్‌
-  లోక్‌మాన్య తిలక్‌ టెర్మినస్‌
-  థానె
-  కల్యాణ్‌
-  పాన్‌వెల్‌
-  భీవాండీ
Tags:    

Similar News