స్మార్ట్ ఫోన్ వచ్చాక యాప్ ల్ని డౌన్ లోడ్ చేసుకోవటం అందరికి అలవాటైంది. యాప్ డౌన్ లోడ్ చేసుకున్నది మొదలు.. మీ ఫోన్లో కాంటాక్ట్స్ తీసుకోవచ్చా?.. మీ ఫోటోలు తీసుకోవచ్చా? అంటూ ఫోన్లో సమాచారం మొత్తాన్ని వాడేసుకోవటానికి అంగీకారాన్ని అడగటం.. ఇవన్నీ మామూలే గా అంటూ అన్నింటికి ఓకే.. ఓకే అనేయటం తెలిసిందే. ఇంచుమించు ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ లింక్ చేసుకోమనటం.. అందుకు మనం సరేననటం కూడా కామన్ అయిపోయింది.
అయితే.. ఇప్పటివరకూ ఇలా ఆధార్ లింక్ చేసుకున్నోళ్లకు ఎలాంటి ఆఫర్ ఎవరూ ప్రకటించలేదు. ఆ లోటును భర్తీ చేస్తే ఇండియన్ రైల్వే కేటరింగ్.. టూరిజం కార్పొరేషన్ (ఐఆర్ సీటీసీ) బంఫర్ ఆఫర్ ప్రకటించింది. రైల్వే ప్రయాణికులు తమ ఆధార్ నంబర్ ను ఐఆర్ సీటీసీ ఖాతాకు అనుసంధానిస్తే వారికి రూ.10వేల వరకూ నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.
ఏంది.. ఐఆర్ సీటీసీకి ఆధార్ లింక్ చేస్తే పదివేల రూపాయిల అని సంబరపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. షరతులు వర్తిస్తాయి మరి. ఊరించే రూ.10వేలు రావాలంటే ఆధార్ తో లింకు చేసుకోగానే సరిపోదు. అలా లింక్ చేసుకున్నోళ్ల పేర్లనుప్రతి నెలా రెండో వారంలో లక్కీ డ్రా తీస్తారు. అందులో ఐదుగురు ప్రయాణికులకు క్యాష్ ప్రైజ్ తో పాటు.. జర్నీ ఛార్జీలను కూడా చెల్లిస్తారట. అయితే.. ఇదంతా అదృష్టవంతులకు మాత్రమే సుమా. సో.. ఆధార్ తో లింక్ చేస్తే రూ.10వేలు అన్నంతనే మురిసిపోకుండా షరతులు కూడా చదివితే విషయం అర్థమవుతుంది. ప్రతి ఆఫర్ కు ఒక లెక్క ఉంటుంది బాస్!