లాక్ డౌన్: రైల్వే శాఖ కీలక ప్రకటన

Update: 2020-04-05 05:10 GMT
దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఏప్రిల్ 14వ తేదీతో పూర్తవువుతంది. ఆ తర్వాత లాక్ డౌన్ ఎత్తివేసి దేశంలో రవాణా సౌకర్యాలను పునరుద్ధరిస్తారా లేదా అన్నది ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. కరోనా వైరస్ నేపథ్యంలో ఇప్పుడు బస్సులు - రైళ్లు - విమానాలను నిలిపివేశారు.  ఏప్రిల్ 15వతేదీ నుంచి సర్వీసులను తిరిగి ప్రారంభించడానికి కార్యాచరణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్టు రైల్వే శాఖ ఈ ప్రకటన వెలువరించింది. దీంతో ముందుగానే వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు రైల్ టికెట్ బుక్ చేసుకుందామని అనుకున్నారు.

అయితే తాజాగా రైల్వే మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం రైల్వే బోర్డు చైర్మన్ తో సమావేశం నిర్ణయించారు. లాక్ డౌన్ ఎత్తివేశాకే రైల్వే సేవలపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు మంత్రుల బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

ప్రస్తుతానికి కొత్త అధికారులు ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేదని - లాక్ డౌన్ ఏప్రిల్ 14 తర్వాతే నిర్ణయం తీసుకుంటామని రైల్వే అధికారులు తెలిపారు. ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రావడానికి తాజా ఆర్డర్లు  లేవని స్పష్టం చేశారు.

అయితే రైళ్లు ప్రారంభమైన కూడా ప్రయాణికులపై థర్మల్ స్ర్కీనింగ్ నిర్వహించి ప్రభుత్వం సూచించిన విధంగా అన్ని ప్రొటోకాల్ లను అనుసరించే అవకాశం ఉందని వర్గాలు తెలిపాయి. దీంతో లాక్ డౌన్ ఎత్తివేసాకే రైల్వే సేవలపై నిర్ణయం తీసుకుంటారు. అప్పటివరకు ఎటువంటి నిర్ణయాలుండవు. దీన్ని బట్టి లాక్ డౌన్ మరింత పెరగవచ్చు అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.    
Tags:    

Similar News