రైళ్ల‌ల్లో స‌రికొత్త 'ఎకాన‌మీ' క్లాస్‌!

Update: 2017-07-03 04:58 GMT
రైళ్ల‌ల్లో స‌రికొత్త క్లాస్ వ‌చ్చేస్తోంది. ఇప్ప‌టివ‌ర‌కున్న సాధార‌ణ‌.. రిజ‌ర్వ్.. ఏసీ త‌ర‌గ‌తులతో పాటు మ‌రో కొత్త క్లాస్ ను తెర మీద‌కు తీసుకురానుంది రైల్వే శాఖ‌. విమానాల్లో బిజినెస్ క్లాస్‌.. ఎకాన‌మీ క్లాస్ ఉన్న‌ట్లే.. రైళ్ల‌ల్లోనూ స‌రికొత్త ఎకాన‌మీ క్లాస్ బోగీల్ని తెర మీద‌కు తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌ణాళిక‌లు రూపొందించారు. త్వ‌ర‌లోనే ప్ర‌యాణికుల‌కు అందుబాటులోకి రానున్న ఈ స‌రికొత్త త‌ర‌గ‌తిలో ప్ర‌త్యేక‌త‌ల‌కు లోటు లేదు.

ఇంత‌కీ ఈ కొత్త క్లాస్ పేరు.. ఎకాన‌మీ ఏసీ. ఈ కొత్త విభాగం రైలు బోగీలు త్వ‌ర‌లోనే ప‌ట్టాల మీద‌కు రానున్నాయి. థ‌ర్డ్ ఏసీ కంటే త‌క్కువ చార్జీల‌తో ఏసీ సౌక‌ర్యాన్ని ఈ బోగీల్లో అందిస్తారు. అదే స‌మ‌యంలో.. ఏసీ మాదిరి వ‌ణుకు పుట్టించే చ‌ల్ల‌ద‌నం ఈ బోగీల్లో ఉండ‌దు. ఇప్ప‌టివ‌ర‌కూ ఏసీ ఛైర్ కార్‌.. త్రీ టైర్‌.. టూ టైర్‌.. ఫ‌స్ట్ క్లాస్ మాత్ర‌మే అందుబాటులో ఉన్నాయి.

వీటి స్థానంలో ఏసీ ఎకాన‌మీ క్లాస్‌ ను తెర మీద‌కు తీసుకొస్తున్నారు. ఈ కొత్త విభాగంలో బోగీ టెంప‌రేచ‌ర్ 24 - 25 డిగ్రీలు మాత్ర‌మే ఉండ‌నుంది. ఈ బోగీల్లో విధులు నిర్వ‌ర్తించే రైల్వే సిబ్బంది డిజైన‌ర్‌ యూనిఫాంలు అంద‌జేస్తారు. ప్ర‌ముఖ ఫ్యాష‌న్ డిజైన‌ర్ రితూ బేరి వీటిని రూపొందించారు. ఈ బోగీల్లో ప్ర‌యాణించే వారికి దుప్ప‌ట్లు అంద‌జేయాల్సి అవ‌స‌రం ఉండ‌దు. మ‌రీ.. కొత్త క్లాస్ ప్ర‌యాణికుల్ని ఎంత‌మేర ఆక‌ట్టుకుంటుందో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News