ప్రపంచ ఆకలి సూచీలో భారత్ స్థానం మరింత దిగజారింది. తాజాగా విడుదలైన ప్రపంచ ఆకలి గణన(గ్లోబల్ హంగర్ ఇండెక్స్-జీహెచ్ఐ) వార్షిక సర్వే నివేదికలో భారత్కు 107 స్థానం దక్కింది. కన్‌సర్న్ హంగర్, వెల్త్ హంగర్ హిల్ఫ్ సంస్థలు సంయుక్తంగా ఈ సర్వే నిర్వహించాయి.
గతేడాది 116 దేశాల్లో నిర్వహించిన ప్రపంచ ఆకలి సూచీలో భారత్ 101 స్థానంలో నిలిచింది. తాజా నివేదికలో మొత్తం 121 దేశాలను పరిగణనలోకి తీసుకుని ఈ సంస్థలు సర్వే నిర్వహించాయి. ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్న శ్రీలంక 64, ఆర్థిక సంక్షోభానికి దగ్గర్లో ఉన్న పాకిస్థాన్ 99 స్థానాల్లో నిలిచాయి.
ఆకలి స్థాయుల్ని లెక్కించడానికి ఉపయోగించే పద్ధతి అశాస్త్రీయంగా ఉందంటూ ఈ నివేదికను గతంలో కేంద్రం ఖండించింది. ప్రస్తుత సూచీపై కాంగ్రెస్ నేత చిదంబరం ట్విట్టర్ వేదికగా స్పందించారు. దేశంలో 22.4 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని తెలిపారు. ఆకలి సూచీలో భారత్ దాదాపు అట్టడుగు స్థానానికి చేరుకుందన్న చిదంబరం.. దీనిపై ప్రధాని మోడీ ఎప్పుడు స్పందిస్తారని విమర్శించారు.
ఈ నివేదికను ఐర్లాండ్‌కు చెందిన ‘కన్‌సర్న్ వరల్డ్‌వైడ్’, జర్మనీకి చెందిన ఆర్గనైజేషన్ ‘వెల్ట్ హంగర్ హిల్ఫే’ ఉమ్మడిగా రూపొందించాయి. భారత్‌లో ఆకలి స్థాయి చాలా తీవ్రంగా ఉందని హెచ్చరించాయి. కాగా 2021లో 116 దేశాలతో జాబితా రూపొందించగా భారత్ 101వ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే.
ఇక ఏడాది 121 దేశాల జాబితాలో 107వ ర్యాంకుకు పడిపోయింది. భారత్ జీహెచ్‌ఐ స్కోరును పరిశీలిస్తే.. 2000 ఏడాది 38.8గా ఉండగా.. 2017 -2022 మధ్య ఇది 28.2 నుంచి 29.1కి పడిపోయింది.
పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ కంటే భారత్ వెనుకబడడం గమనార్హం. కాగా గ్లోబల్ హంగర్ ఇండెక్స్(జీహెచ్‌ఐ)లో చైనా, టర్కీ, కువైట్ సహా మొత్తం 17 దేశాలు టాప్ ర్యాంకులో నిలిచాయి. ఈ దేశాల జీహెచ్‌ఐ స్కోరు 5 కంటే తక్కువగా ఉంది. ఆకలి, పౌష్టికాహారం వంటి అంశాలను పరిగణలోకి దేశాల స్కోరును నిర్ణయిస్తారు. ఈ మేరకు ‘గ్లోబల్ హంగర్ ఇండెక్స్’ వెబ్‌సైట్ పేర్కొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.