ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుపై సర్వత్రా విమర్శలు వస్తోన్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో కోహ్లీ కెప్టెన్ ఇన్నింగ్స్ తో కొద్ది పరుగుల తేడాతో ఓటమి పాలైన టీమిండియా...రెండో టెస్టులో ఇన్నింగ్స్ పరాజయాన్ని మూటగట్టుకుంది. దీంతో, కోహ్లీ సేనను బలికి సిద్ధంగా ఉన్న మేకలతో పోలుస్తూ ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ బాయ్ కాట్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇపుడు తాజాగా పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ కూడా టీమిండియాపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఏడాది ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో తమ జట్టు భారత్ కన్నా బాగా సన్నద్ధమైందని, తమ జట్టు పోరాట పటిమను ప్రదర్శించిందని సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయిఏ, ఇంగ్లండ్ లో పర్యటించే ప్రతి ఉపఖండపు జట్టుకి ఇబ్బందులు తప్పవని అన్నాడు.
2016లో నేను తాము 25 రోజులు ముందే ఇంగ్లండ్ కు వెళ్లి అక్కడి పరిస్థితులకు అలవాటుపడ్డామని, రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా ఆడామని అన్నాడు. దీతో, 4 టెస్టుల సిరీస్ ను 2-2తో ముగించామన్నాడు. ఆ తర్వాత ఏడాది 3 టెస్టుల సిరీస్ ను 1-1తో డ్రా చేసుకున్నామని, అందుకే ఇంగ్లండ్ తో ఆడేందుకు భారత్ కంటే తాము మెరుగ్గా సన్నద్ధమైనట్లు అనిపిస్తోందన్నాడు. ప్రస్తుతం జరుగుతోన్న టెస్ట్ సిరీస్ కు ముందు భారత్ కేవలం ఒక ప్రాక్టీస్ మ్యాచ్ మాత్రమే ఆడిన సంగతి తెలిసిందే. అంతకుముందు జరిగిన టీ-20 సిరీస్ సొంతం చేసకున్న టీమిండియా...వన్డే సిరీస్ లో ఓటమి పాలైంది. తొలి రెండు టెస్టులలో కోహ్లీ మినహా భారత బ్యాట్స్ మన్లు విఫలం కావడంతో....తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరి, ఈ నెల 18వ తేదీ నుంచి ట్రెంట్ బ్రిడ్జ్ వేదికగా జరిగే మూడో టెస్ట్ లో టీమిండియా రాణించి విమర్శలకు చెక్ పెడుతుందేమో వేచి చూడాలి.