కన్నతల్లి చనిపోతే ఆఖరి చూపు కూడా దక్కలేదని మనసులో తీరని ఆవేదన, ఎర్రని ఎండలో, చుట్టూ వడగాలుల్లో దాదాపుగా 22 కిలోమీటర్ల నడక...అలాంటి ఎంత ఇబ్బంది కరంగా ఉంటుంది ఊహించండి?! అలా ఒకసారి కాదు. దాదాపు 20 సార్లు.అంటే మొత్తం వెయ్యి కిలోమీటర్లు.!!అది కూడా దేశం కాని దేశంలో ఇలాంటి పరిస్థితి ఎదుర్కోవడం. నిజంగా ఇలాంటి సమస్యను మనం ఊహించుకోలేం. తమిళనాడులోని తిరుచిరాపల్లికి చెందిన జగన్నాథన్ సెల్వరాజ్ రెండేళ్లుగా ఇలాంటి కష్టమే దుబాయ్‌లో పడ్డాడు. అయితే ఆ కష్టానికి తెరపడింది.
పొట్టకూటి కోసం సెల్వరాజ్ దుబాయ్ వెళ్లాడు. అయితే రెండేళ్ల కిందట సొంతూళ్లో తల్లి చనిపోతే.. ఆమె అంత్యక్రియలకు స్వదేశం రావడానికి అక్కడ అతను పనిచేసే సంస్థ నిరాకరించింది. దీంతో అతను కోర్టుకెక్కాడు. దుబాయ్‌కి చేరువలో సోనాపూర్ అనే గ్రామంలో అతను ఉండేవాడు.అయితే తన కేసు విచారణ కోసం 22 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరామాలో ఉన్న లేబర్ కోర్టుకు తరచూ వెళ్లి వస్తుండేవాడు. బస్సు ఎక్కడానికి కూడా డబ్బులు లేకపోవడంతో నడిచే వెళ్లేవాడు. ఇలా రెండేళ్లలో కనీసం 20 సార్లు కోర్టు విచారణలకు అతను హాజరయ్యాడు. ఈ లెక్కన అతను మొత్తం వెయ్యి కిలోమీటర్ల దూరం నడిచాడు. మొత్తానికి ఈ విషయం విదేశాంగమంత్రి సుష్మాస్వరాజ్‌కు తెలియడంతో ఆమె అతన్ని స్వదేశానికి తీసుకురావడంలో విజయవంతమైంది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ట్విట్టర్‌లో వెల్లడించింది.
తను ఎదుర్కొన్న నరకం గురించి సెల్వరాజ్ మీడియాతో మాట్లాడుతూ.. దుబాయ్‌లో ఉండే భీకరమైన ఎండ వేడిమికి తట్టుకొని 15 రోజులకోసారి కోర్టుకు వెళ్లిరావడం తనకు చాలా కష్టంగా ఉండేదన వాపోయాడు. ఈ సమస్య లో కొంత లో కొంత ఉపశమనంకోసం ఉదయాన్నే 4 గంటలకు లేచి వెళ్లేవాడినని సెల్వరాజ్ చెప్పాడు. నిజంగా ఎంత హృదయవిదారక పరిస్థితి. న్యాయం కోసం వెయ్యి కిలోమీటర్లు, రెండేళ్ల పోరాటానికి ఫుల్ స్టాప్ పడేలా చేసిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ అభినంనీయురాలు. ఏమంటారు?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/