వేదిక ఏదైనా మనోడ్ని ఓడించినోడు మనకు ప్రత్యర్థి. వాడ్ని చూసి మనం ఆగ్రహం చెందుతాం. మనోడు గెలిస్తే బాగుండేదని బాధ పడతాం. కానీ.. తాజాగా జరిగిన ఆసియా క్రీడల్లో మాత్రం ఇందుకు భిన్నమైన సీన్ ఒకటి చోటు చేసుకుంది. ఈ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. మనోడ్ని ఓడించిన సదరు ఇరానియన్ ఆటగాడి మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకిలా అంటే..
ఇండోనేషియా వేదికగా ఆసియా క్రీడలు జరుగుతున్న సంగతి తెలిసిందే. పురుషులు వుషులో సందా 60 కేజీల విభాగంలో సెమీఫైనల్స్ పోటీలు జరిగాయి. ఇందులో భారత్ కు చెందిన సూర్యభాను ప్రతాప్.. ఇరాన్ కు చెందిన ఇర్పాన్ తో తలపడ్డాడు. ఈ మ్యాచ్ లో సూర్యప్రతాప్ ఓడిపోయాడు.
మ్యాచ్ మధ్యలో కాలికి గాయం కావటంతో అతను తీవ్ర బాధకు గురయ్యాడు.చివరకు ఈ పోటీలో సూర్యప్రతాప్ ఓడిపోగా.. ఇరాన్ ఆటగాడు విజేతగా నిలిచాడు. రిఫరీ వీరిద్దరిని విజేతగా ప్రకటించే సమయంలో కాలి నొప్పితో సూర్య భాను ప్రతాప్ సరిగా నిలబడలేని పరిస్థితి. విజేతగా తనను ప్రకటించిన తర్వాత.. రింగ్ నుంచి భానుప్రతాప్ ను ఎత్తుకొని భారత కోచ్ వద్దకు తీసుకెళ్లిన ఇరాన్ ఆటగాడి క్రీడాస్ఫూర్తికి అక్కడున్న వారే కాదు.. కోట్లాది మంది భారతీయులు సైతం ఫిదా అయ్యారు.
మావోడు ఓడిపోతే ఓడిపోయాడు.. నువ్వు మాత్రం నీ పనితో మా మనసుల్ని గెలుచుకున్నావ్.. నువ్వు స్వర్ణం సాధించాలంటూ భారత క్రీడాభిమానులు ప్రశంసిస్తున్నారు. అంతేకాదు.. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా.. ఈ పోటీలో ఓడిన సూర్య భాను ప్రతాప్ కాంస్యంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.