చేతిలో పవర్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించటం ఈ మధ్యన ఒక అలవాటుగా మారింది. తాము వచ్చినప్పుడు విమానం ఎక్కించుకోవాలన్నట్లుగా కొందరు నేతల తీరు కనిపించక మానదు. ఇండిగో సిబ్బందిపై ఏపీ ఎంపీ.. టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి వేసిన వీరంగం ఇప్పుడు సంచలనంగా మారింది.
ఆ మధ్యన మహారాష్ట్రకు చెందిన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఫూణె ఎయిర్ పోర్ట్‌కు వెళ్లి.. అక్కడ ఎయిరిండియా సిబ్బంది మీద చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీనిపై తీవ్రంగా స్పందించిన ఎయిరిండియా ఆయనపై బ్యాన్ విధించింది.
సదరు పొగరబోతు ఎంపీ గైక్వాడ్ కు..కొద్ది కాలం పాటు బ్యాన్ విధించి అమలు చేశారు. అనంతరం దీన్ని ఎత్తి వేశారు. తప్పు చేసి కూడా.. దర్జాగా విమానాల్లో గైక్వాడ్ తిరుగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎంపీ రవీంద్రకు ఏ మాత్రం తీసిపోని రీతిలో అనంతపురం అధికారపక్ష ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తాజాగా చేసిన హడావుడి ఇప్పుడు పెను సంచలనంగా మారింది.
బోర్డింగ్ క్లోజ్ చేసిన తర్వాత వచ్చిన జేసీ..ఇండిగో సిబ్బంది తీరును తీవ్రంగా తప్పు పట్టారు. బోర్డింగ్ క్లోజ్ అయిన తర్వాత వచ్చిన తనను విమానంలోకి అనుమతించాల్సిందిగా డిమాండ్ చేశారు. దీనికి ఇండిగో సిబ్బంది నో చెప్పేశారు. ఈ సందర్భంగా జేసీ చెలరేగిపోయారు. బోర్డింగ్ పాసుల్ని ముద్రించే జిరాక్స్ మిషన్ ను విసిరి కొట్టినట్లుగా ఇండిగో సిబ్బంది ఆరోపిస్తున్నారు.
ఇండిగో సిబ్బందిపై ఎంపీ జేసీ తీరు సంచలనంగా మారటమే కాదు.. ఆయనపై నిషేధాన్ని విధిస్తూ సదరు విమానయాన సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇండిగో మాదిరి ఎయిరిండియా సైతం జేసీ పై బ్యాన్ విధించింది. మిగిలిన విమానయాన సంస్థలు సైతం ఇలాంటి బాటనే పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/