ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాదనకు మరో చిరుద్యోగం లేదా పార్ట్‌టైమ్ పనిచేసేవారు ఎక్కువగానే ఉంటున్నారు. ఇలాంటి తమ ఉద్యోగులకు ఐటీ దిగ్గజం.. భారీ షాక్ ఇచ్చింది. తమ అనుమతి లేకుండా తమ ఉద్యోగులెవరూ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు ఉద్యోగులకు అందరికీ ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.
కంపెనీ ఉద్యోగుల హ్యాండ్‌బుక్, ప్రవర్తనా నియమావళి ప్రకారం.. మూన్‌లైటింగ్ (ఒకే సమయంలో రెండు ఉద్యోగాలు)కు అనుమతి లేదని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది. ఎవరైనా దీన్ని ఉల్లంఘిస్తే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని కూడా హెచ్చరించింది,
వర్క్ ఫ్రం హోం విధానంలో పనిచేసేవారు మూన్‌లైటింగ్ (రెండు ఉద్యోగాలు) చేస్తున్నారని తమ పరిశీలనలో వెల్లడైనట్టు ఇన్ఫోసిస్ తెలిపింది. తమ అనుమతి లేకుండా ఇన్ఫోసిస్ ఉద్యోగి ఏదైనా వ్యాపార కార్యకలాపాల్లో పూర్తి సమయం లేదా పార్ట్‌టైమ్ ఉద్యోగం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఇది ఉత్పాదకతపై ప్రభావం చూపడం తోపాటు ఉద్యోగి పని తీరు, సమాచారం లీకేజీ, ఇతర రహస్య సమాచారం లీకేజీ వంటి తీవ్ర సమస్యలు తలెత్తుతాయని పేర్కొంది.
ఇప్పటికే మరో ఐటీ దిగ్గజం.. విప్రో చైర్మన్ రిషద్ ప్రేమ్‌జీ ఉద్యోగులు ఒక కంపెనీ పనిచేస్తూ రెండు ఉద్యోగాలు చేయడం మోసం అని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇన్ఫోసిస్ కూడా విప్రో బాటలో పయనించడం గమనార్హం.
అయితే ఇన్ఫోసిస్ నిబంధనల ప్రకారం.. ఉద్యోగులు 9 గంటలు మాత్రమే పనిచేయాలి. కాబట్టి 9 గంటలు విధులు నిర్వహించాక ఉద్యోగులు బయటకు వెళ్లిపోయాక వాళ్లు ఏం చేసుకుంటే కంపెనీకి అనవసరం అని ఉద్యోగుల అసోసియేషన్ చెబుతోంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రతి పౌరునికి జీవనోపాధి పొందే హక్కును అందించింది, కాబట్టి ఉద్యోగులకు పంపే ఇటువంటి ఈమెయిల్‌లు చట్టవిరుద్ధం, అనైతికమని ఐటీ ఉద్యోగుల అసోసియేషన్ వాదిస్తోంది.
కాగా ఇన్ఫోసిస్ మాజీ డైరెక్టర్ టీవీ మోహన్‌దాస్ పాయ్ చెప్పేదాని ప్రకారం.. ఉద్యోగులు కంపెనీ నిబంధనలు, ఒప్పందానికి కట్టుబడి ఉంటారు. కంపెనీ ఐపీని ఉపయోగించినంతవరకు ఉద్యోగులు ఏమైనా చేసుకోవచ్చు అని ఆయన చెబుతుండటం విశేషం. అసలు ఉద్యోగులు ఎందుకు రెండు ఉద్యోగాలను కోరుకుంటున్నారో కంపెనీలు తెలుసుకోవాలని ఆయన సూచిస్తున్నారు. వారికి తక్కువ వేతనం ఇస్తున్నామా అనేది పరిశీలించుకోవాలని చెబుతున్నారు.
ఇక కంపెనీల కోణంలో చూస్తే.. ఐటీ కంపెనీల మధ్య మార్కెట్‌లో పోటీ పెరుగుతోంది. ఇప్పటికే ఉద్యోగులు ఒక కంపెనీ నుంచి ఇంకొక కంపెనీకి వలసపోతున్నారు. గత రెండేళ్లు కోవిyŠ ప్రభావం, ఆర్థిక మాంద్యం పట్టిపీడిస్తున్నాయి. ఈ సమయంలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే ఉద్యోగులు రెండు ఉద్యోగాలు (మూన్ లైటింగ్) చేయడం తమకు ఇబ్బంది అని అంటున్నాయి.
ఇలా వర్క్–ఫ్రమ్–హోమ్ చేసే ఉద్యోగుల్లో 65 శాతం మంది పార్ట్‌టైమ్ అవకాశాలలో నిమగ్నమై ఉన్నారని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీ సర్వేలో ఇటీవల వెల్లడైంది. కాగా ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్.. స్విగ్గీ ఆగస్టు ప్రారంభంలో ఉద్యోగులకు పార్ట్‌టైం వర్క్ చేసుకునే అవకాశాన్ని ప్రకటించడంతో మూన్‌లైటింగ్ అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, ఉద్యోగులు పని చేయకుండా బయట ఏం చేస్తున్నారో చూసేంత శక్తి, సామర్థ్యం మేనేజ్‌మెంట్‌కు ఉండదని నిపుణులు చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.