ఇన్ఫోసిస్ పెద్ద మనసు: అమెరికా నుంచి ఇండియాకు ఉద్యోగుల

Update: 2020-07-07 16:00 GMT
ప్రస్తుతం కరోనా కష్టకాలంలో విమానాలన్నీ బంద్ అయిపోయాయి. ఏ దేశంలో చిక్కుకున్న వారంతా అదే దేశంలో బంధీ అయిపోయారు. ఇక అమెరికాలో పనిచేస్తున్న భారతీయులపై ట్రంప్ పిడుగు వేయడంతో అక్కడ వీసాలు రెన్యువల్ కాక హెచ్1బీ ఉద్యోగులంతా దేశం విడిచి పెట్టాల్సిన పరిస్థితి. విమానాలు లేకపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే అమెరికాలో కష్టాలు పడుతున్న తమ ఉద్యోగులను ఆదుకునేందుకు ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ గొప్ప పనిచేసింది. ఏకంగా ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి మరీ అమెరికాలో వీసా గడువు తీరిపోయిన తమ ఉద్యోగులను భారత్ కు తీసుకొచ్చి శభాష్ అనిపించుకుంది.

ప్రత్యేక విమానాన్ని సమకూర్చి మరీ ఇన్ఫోసిస్ సంస్థ 206మంది ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులను సోమవారం బెంగళూరుకు తీసుకొచ్చింది. తాజాగా ఈ విషయాన్ని ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. అమెరికాలో పనిచేస్తున్న ఇన్ఫోసిస్ ఉద్యోగుల హెచ్1బీ వీసా గడువు ముగిసిపోయింది. విమానాల రాకపోకలు ఆగిపోవడంతో వారంతా ఇండియాకు రాలేకపోయారు. దీంతో వారిని కుటుంబాలతో సహా ఇండియాకు తీసుకురావడానికి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసినట్లు ఇన్ఫోసిస్ తెలిపింది.

ఉద్యోగులను ఖతార్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో శాన్ ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది. కంపెనీ చేసిన సాయానికి చాలా మంది ఇన్ఫోసిస్ ఉద్యోగులు ప్రశంసిస్తూ ట్వీట్స్ చేశారు.
Tags:    

Similar News