ఇంజెక్షన్ లతో దాడులకు పాల్పడుతూ తెలుగు రాష్ట్రాల్లో అలజడి రేపుతున్న సిరంజి సూదిగాడు తాజాగా హైదరాబాద్ లోని కూకట్పల్లి హౌజింగ్ బోర్డు కాలనీలో ఓ యువకుడిపై దాడిచేశాడు. శేఖర్ అనే యువకుడిని సిరంజితో గుచ్చి అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలంతా ఆందోళనకు గురయ్యారు. బాధిత యువకున్ని ఆసుపత్రికి తరలించి చికిత్స నిర్వహిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించడంతో చుట్టు పక్కల ప్రాంతంలో గాలింపు చేపట్టారు.
పశ్చిమగోదావరి మొదలైన ఈ దాడులు ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో పెద్ద సమస్యగా మారినా ఇంతవరకు అసలు నేరస్థులను పోలీసులు పట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లోనూ పలు ప్రాంతాల్లో సూదిగుచ్చిన సంఘటనలు కలకలం రేపాయి. తాజాగా కేసీహెచ్ బీ ఘటనలో బాధితుడ్ని చికిత్స కోసం ఆస్పత్రికి చేర్పించారు. ఈ నిందితుల కోసం ఆంధ్ర పోలీసులు ఇప్పటికే అంతటా గాలిస్తున్నా తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వేర్వేరు చోట్ల జరుగుతుండడంతో ఇది ఆకతాయిలా పనా... లేదంటే ఏదైనా ముఠా ఉందా అన్నది తేలాల్సి ఉంది. తరచూ ఈ దాడులు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.