ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో రాయితీపై ఇచ్చిన ఇన్నోవాలను మళ్లీ వెనక్కు తీసుకోవడం కరెక్టు కాదని... వాటిని తిరిగి ఇవ్వాలని పలువురు ఎస్సీ నేతలు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావుపై ఒత్తిడి తెస్తున్నారు. ఎస్సీ కార్పొరేషన్ సహకారంతో సబ్సిడీ ద్వారా ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు ఫొటో లేదనే కారణంతో ఇచ్చిన 10 కార్లలో 8 కార్లను చైర్మన్ రెండు రోజుల కిందట వెనక్కు తీసుకున్నారు.
కాగా.... పలువురు ఎస్సీ నేతలు సూచించినవారికే ఈ కార్లు ఇచ్చారు. అయితే... వాటిపై చంద్రబాబు ఫొటో ముద్రించకపోవడంతో కార్పొరేషన్ వాటిని వెనక్కు తీసుకుంది. దీంతో తమకు అవి ఇచ్చేస్తే చంద్రబాబువి పెద్ద పెద్ద ఫొటోలు పెట్టించేస్తామని... ఎలాగైనా ఇవ్వాలని లబ్ధిదారులు కోరుతున్నారు. అయితే... జూపూడి మాత్రం ఎందుకనో దీనిపై ఇంకా ఏమీ డిసైడ్ చేయలేదుట.
సుమారు నెల రోజుల కిందట ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున ఇన్నోవా కార్లను లబ్ధిదారులకు ఇచ్చారు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కార్లు తిరుగుతున్నాయి. లబ్ధిదారులకు ఇచ్చే సమయంలో కొన్ని కార్లకు సీఎం స్టిక్కర్ కూడా లేదు. ఆ తరువాత ఉన్న స్టిక్కర్‌ను కూడా పీకేశారు. మిగతా టీడీపీ నాయకులు ఎవరూ ఈ విషయం సీరియస్ గా పట్టించుకోకపోయినా జూపూడి మాత్రం కార్లను వెనక్కు తీసుకోవడం ఏంటని పలువురు నాయకులు ప్రశ్నిస్తున్నారు.
అయితే... ఇక్కడ లబ్ధి దారులు చెబుతున్న విషయం ఆసక్తి కరంగా ఉంది. ఇవన్నీ అద్దెకు తిప్పడానికి ఉద్దేశించి ఇచ్చిన కార్లు. వాటిపై చంద్రబాబు ఫొటో ఉంటే కొందరు ఇష్టపడరని... అందువల్ల అద్దెలు రావని, అందుకే సీఎం ఫొటో తీసేయాల్సి వచ్చిందని అంటున్నారు. నెలకు దాదాపుగా రూ.20 వేల వరకు ఎస్సీ కార్పొరేషన్‌కు కట్టాల్సి ఉంది. అద్దెలు రాకపోతే ఈ నగదు ఎక్కడి నుంచి తీసుకురావాలని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.