ఇన్ స్టా కొత్త వ్యూహం...జ‌న‌హిత‌మా? ఆర్జ‌న కోస‌మేనా?

Update: 2019-07-28 01:30 GMT
సోష‌ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో ఇన్‌ స్టాగ్రామ్ కూడా ఓ కీల‌క వేదికే. ఫేస్ బుక్‌ - ట్విట్ట‌ర్ తర్వాతి స్థానం ఇన్‌ స్టా దే. సోష‌ల్ మీడియా స‌మాజంలో యాక్టివ్ రోల్ పోషిస్తున్న నేప‌థ్యంలో ఫేస్ బుక్‌ - ట్విట్ట‌ర్ ల‌తో పాటు ఇన్ స్టా ప్రాదాన్యం కూడా అంత‌కంత‌కూ పెరిగిపోతోంద‌నే చెప్ప‌క త‌ప్ప‌దు. డిజిట‌ల్ మార్కెట్ ఎప్ప‌టిక‌ప్పుడు త‌మ ఆదాయాన్ని పెంచుకునేందుకు స‌రికొత్త ప్ర‌యోగాలు చేస్తున్న ఆయా సంస్థ‌లు... త‌మ వినియోగ‌దారుల‌కు కొంగొత్త ఆప్ష‌న్ల‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. వీల‌యినంత మంది వినియోగాదారుల‌కు చేరువ‌వ్వ‌డంతో ఆదాయాన్ని పెంచుకుంటున్న ఈ సంస్థ‌లు... అందుకోస‌మే  స‌రికొత్త ఆప్ష‌న్లు తీసుకొస్తున్నాయి. ఇలాంటి క్ర‌మంలో ఈ త‌ర‌హా వైఖ‌రికి భిన్నంగా వ్య‌వ‌హ‌రించిన ఇన్ స్టా... ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఓ ఆప్ష‌న్ ను ఎత్తివేస్తోంది. ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా ఆ సంస్థ వెల్ల‌డించినా... దాని వెనుక అస‌లు వ్యూహం అది కాద‌ని ఇట్టే అర్థ‌మైపోతోంది.

అయినా ఇప్పుడు ఇన్ స్టా కొత్త‌గా తీసుకున్న నిర్ణ‌యం ఏమిటంటే... మ‌నం పోస్ట్ చేసే ఫొటోల‌కు ఇక‌పై లైక్ లు క‌నిపించ‌వ‌ట‌. నిజ‌మా? అంటే... స్వ‌యంగా ఇన్ స్టానే ప్ర‌క‌టించిన త‌ర్వాత నిజ‌మేన‌ని ఒప్పుకోక త‌ప్ప‌దు క‌దా. ప్ర‌స్తుతానికి కేవ‌లం ఆస్ట్రేలియా వ‌ర‌కు మాత్ర‌మే అమ‌ల‌య్యే ఈ నిబంధ‌న‌.. త్వ‌ర‌లో అన్ని దేశాల‌కు విస్త‌రించే అవ‌కాశాలు లేక‌పోలేద‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ నిర్ణ‌యానికి గ‌ల కార‌ణాల‌ను ఇన్ స్టా ఎలా చెప్పింద‌న్న విష‌యానికి వ‌స్తే... ఇన్ స్టాలో తాము పోస్ట్‌ చేసిన ఫొటోలకు ఎక్కువ లైక్స్‌ వచ్చిన వారు ఎగిరి గంతెయ్యడం - తక్కువ లైక్స్‌ వచ్చిన వారు చిన్న బుచ్చుకోవడం తెలిసిందే క‌దా. ఇది విశ్వ‌వ్యాప్తంగా క‌నిపిస్తున్న ట్రెండే. పిచ్చి పిచ్చిగా లైక్స్‌ వచ్చే ఫొటోలకు ఇన్‌స్టా భారీ ఎత్తున డబ్బులు కూడా చెల్లిస్తున్న విషయం తెల్సిందే.

ఇంతవరకు బాగానే ఉందిగానీ ఆస్ట్రేలియాలో తమ ఫొటోలకు లైక్స్‌ రానివారు మానసికంగా బాగా కుంగిపోతున్నారట. ఈ మధ్య ఒకరిద్దరు మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయ‌ట‌. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా యూజర్స్‌కు వచ్చే లైక్స్‌ను తాము ఇక నుంచి బయట పెట్టమని - కనపడకుండా చేస్తామని ‘ఇన్‌ స్ట్రాగ్రామ్‌’ యాజమాన్యం ప్రకటించింది. ప్రజల్లో సానుకూల మార్పు తీసుకురావడమే తమ వేదిక దృక్పథమని  కూడా పేర్కొంది. అయితే ఇదంతా అబద్ధమని - యాడ్స్‌ ద్వారా భారీగా డబ్బును దండుకోవాలన్నదే యాజమాన్యం వైఖరిగా కనిపిస్తోందని ఆస్ట్రేలియా ఆన్‌ లైన్‌ మార్కెటింగ్‌ నిపుణులు ఆరోపిస్తున్నారు. సహజంగా యాడ్స్‌ ఫొటోలకు లైక్స్‌ తక్కువగా వస్తాయని - అది బయటపడకుండా ఉండేందుకే యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకొని ఉంటుందని వారంటున్నారు.

ఈ క్రమంలో ‘కాస్మోటిక్స్‌ నుంచి ప్రొటీన్‌ షేక్స్‌ వరకు అమ్ముతున్న అమ్మకం దారులు భారీగా లాభాలు గడిస్తుంటే - వాటిని ప్రచారం చేస్తున్న ఇన్‌ స్టాగ్రామ్‌ కు అంతగా యాడ్‌ రెవెన్యూ రావడం లేదు. అందుకని చిన్న చిన్న వ్యాపారులను కూడా ప్రోత్సహించడానికి వీలుగా లైక్స్‌ ను తీసివేయాలని నిర్ణయించి ఉంటుంది. అది ఒక్క ఆస్ట్రేలియాకే పరిమితం చేయడం అంటే ఇన్‌స్టాగ్రామ్‌కు ఈ దేశం నుంచే ఎక్కువ యాడ్‌ రెవెన్యూ వస్తోంద‌నేది మార్కెటింగ్‌ నిపుణులు మర్మర్‌ బోస్‌ దేవ్‌ లెవెట్ వాద‌న‌. ఇన్‌ స్టాగ్రామ్‌ లో బికినీ భామలు - ఫిట్‌ నెస్‌ బ్లాగర్ల ద్వారా వ్యాపార సంస్థలకు ఏటా 2.50 కోట్ల డాలర్ల వ్యాపారం జరుగుతుంటే ఇన్‌ స్టాగ్రామ్‌ కు కేవలం 20 లక్షల డాలర్ల యాడ్‌ రెవెన్యూ మాత్రమే వస్తుందని, అందుకని ఈ కొత్త ఎత్తుగడ అని మరొక మార్కెటింగ్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు.

  


Tags:    

Similar News