మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. ఎమోషనల్ గా ఉన్న ఇష్యూను టేకప్ చేసే విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అందునా.. తీవ్రమైన భావోద్వేగంతో ఉన్న సమూహం వద్దకు సాదాసీదాగా వెళితే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న దానికి నిదర్శనంగా తాజా పరిణామాన్ని చెప్పాలి. తాజాగా యూపీలోని ఒక బీజేపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం ఎదురైంది. అధికారంలో ఉన్నాం కదా? అన్న ఆత్మవిశ్వాసం ఆయన కొంప మునగటమే కాదు.. దారుణమైన అవమానం ఆయనకు ఎదురైంది.
ఆయన కాన్వాయ్ మీద దాడి చేయటం.. నల్ల సిరా చిమ్మటం.. రాళ్లు వేసి ఎమ్మెల్యే వాహనంపై దాడి చేయటం లాంటివి చేశారు. భద్రతా సిబ్బందితమ ప్రాణాల్ని పణంగా పెట్టి.. ఆయన్ను పెను ప్రమాదం నుంచి తప్పించారు. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇంతకీ అంతలా బీజేపీ ఎమ్మెల్యేను తరిమి కొట్టటానికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. సదరు ఎమ్మెల్యే వెళ్లింది మరెక్కడికో కాదు.. కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసనలు చేస్తున్న రైతు నాయకుడు రాకేశ్ టికాయత్ గ్రామానికి వెళితే.. బీజేపీ ఎమ్మెల్యేకు అలాంటి అనుభవం కాక మరెలాంటి స్వాగతం లభిస్తుంది? అని ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర చట్టాలను తీవ్రంగా తప్పు పడుతున్న రాకేశ్ తికాయిత్ సొంత ఊరికి ఒక కార్యక్రమానికి హాజరయ్యేందుకు స్థానిక బీజేపీ ఎమ్మెల్యే ఉమేశ్ మాలిక్ వెళ్లారు. కేంద్రం తీరుతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న వారికి.. హంగు ఆర్భాటాలతో వెళ్లిన ఎమ్మెల్యే.. అక్కడి ప్రజల మూడ్ ను సరిగా అర్థం చేసుకోనట్లుంది. అందుకే ఆయనకు తిప్పలు తప్పలేదు.బుదాన నియోజకవర్గానికి చెందిన ఈ బీజేపీ ఎమ్మెల్యే ముజఫర్ నగర్ లోని సిసౌలీ ప్రాంతంలో పర్యటించారు. అక్కడ జన కల్యాణ సమితి నిర్వహిస్తున్న కార్యక్రమానికి హాజరయ్యారు.
దీంతో.. ఆయన్ను అడ్డుకున్న నిరసనకారులు ఆయన ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే.. దీన్ని అక్కడి బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారటమే కాదు.. పరిస్థితి చేయి దాటిపోయింది. ఎమ్మెల్యేపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. ఆయనపై దాడికి తెగబడ్డారు. ఆయన కాన్వాయ్ వాహనాన్ని ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న వాహనంపైనా రాళ్ల దాడి జరిగింది. లక్కీగా భద్రతా సిబ్బంది పుణ్యమా అని బీజేపీ ఎమ్మెల్యే సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే.. దారుణ పరిణామం చోటుచేసుకునేదే. యూపీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. అధికార బీజేపీ నేతకు ఇలాంటి అనుభవం ఎదురుకావటం యోగి సర్కారుకు కొత్త చిక్కుల్ని తెచ్చినట్లుగా చెప్పక తప్పదు.
Full View
Full View Full View