ఏపీ విపక్ష నేత.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆరోపణ చేశారు. తాజాగా కడప శిరు చింతకొమ్మదిన్నె వద్దనున్న నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్య చేసుకున్న ఉదంతంపై మాట్లాడిన ఆయన.. తీవ్ర ఆరోపణలు చేశారు. వివిధ నారాయణ కాలేజీల్లో ఈ మధ్య కాలంలో మొత్తం పదకొండు మంది విద్యార్థినులు మరణించారని చెప్పారు.
ఇంత భారీగా విద్యార్థులు మరణిస్తున్నా.. చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. నారాయణ కాలేజీలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలు చోటు చేసుకున్న సమయంలో చంద్రబాబు కడపజిల్లాలోనే ఉన్నారని.. అయినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఇలాంటి ఘటనే వేరే కాలేజీల్లో జరిగితే చంద్రబాబు పట్టించుకోనట్లుగా ఉంటారా? అని జగన్ ప్రశ్నించారు. ఆత్మహత్య ఉదంతం నాలుగు గంటలకు జరిగితే.. ఆరున్నర గంటల వరకు చంద్రబాబు జిల్లాలోనే ఉన్నా పట్టించుకోలేదన్నారు.
నారాయణ కళాశాల్లలో విద్యార్థులు మరణించటంపై విచారణ జరపాలంటున్న జగన్.. బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినుల బంధువులు కాలేజీ మీద దాడి చేయగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు.
ఇక.. ఈ ఆత్మహత్యలపై కడప జిల్లా ఎస్పీ స్పందిస్తూ.. ఆత్మహత్యలు చేసుకున్న ఇద్దరు విద్యార్థినుల్లో నందిని ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిందని.. మరణించిన మరో విద్యార్థిని మనీష మృతికి కారణాలేమిటన్న విషయం తేల్చేందుకు విచారణకు ఆదేశిస్తున్నట్లు పేర్కొన్నారు.