అనుకుంటున్నారు జనసేన కార్యకర్తలు లోలోన. వాళ్లే కాదు బటయ రాజకీయ వర్గాలు, సామాన్య జనాలు కూడా ఇప్పుడా మాటే సంధిస్తున్నారు జనసే అధ్యక్షుడు పవన్ కల్యాణ్. వైసీపీలో టికెట్ రాని వారికి జనసేన తలుపులు తెరచి ఉంచామని ఆ పార్టీ నేతలు ఆఫర్ ఇస్తున్నట్లుగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఇది రాజకీయ వ్యూహమని ఆ పార్టీ అగ్రనేతలు సమర్థించుకుంటున్నా ఆ పార్టీలో అసంతృప్తిని, బయట విమర్శలకు దారి తీస్తోంది. పార్టీ తీసుకోబోయే ఈ నిర్ణయం తప్పుడు సంకేతాలు తీసుకెళుతుందని జనసైనికులు లోలోన మథనపడుతున్నారట.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పెట్టి దాదాపు దశాబ్దకాలం దాటిపోతోంది. ఒక పార్టీ నిలదొక్కుకోవడానికి ఇది చాలా సుదీర్ఘ సమయం. కానీ ఏపీలో జనసేన పరిస్థితి దీనికి పూర్తీ భిన్నంగా కనిపిస్తోంది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ ఎంతో బలహీనంగా ఉందనేది అందరికీ తెలిసిందే. పవన్ కల్యాణ్ పెట్టే బహిరంగ సభలకు జనం ఫుల్‌గా వస్తున్నా అది ఆ పార్టీకి వాపులాగే మారిందని కానీ బలంగా మారడం లేదు.
జనసేనాని కూడా పార్టీ క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంపై ఈ దశాబ్ద కాలంలో దృష్టి సారించేలేదు. దాంతో పార్టీ క్షేత్రస్థాయిలో బలంగా లేదు. మరోవైపు అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు క్షేత్రస్థాయిలో చాలా బలంగా ఉన్నాయి. ఎన్నికల్లో గెలుపోటములు ఎలా ఉన్నా ఈ రెండు పార్టీలు వైరిపక్షాలకు చుక్కలు చూపించేస్థాయిలో వేళ్లూనుకునిపోయాయి. కానీ జనసేన మాత్రం ఇప్పటికీ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి.
ఒకవేళ జనసేనానికి పొత్తుల్లేకండా ఒంటరిగా బరిలోకి దిగితే 175 స్థానాలకు కనీసం అభ్యర్థులు కూడా లేని పరిస్థితి ఇప్పటికీ నెలకొని ఉంది. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ వైసీపీలో టికెట్ పొందలేని సిట్టింగు ఎమ్మెల్యేలకు మేం టికెట్లు ఇస్తామంటూ ఇస్తున్న ఆఫర్ చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ నేతలు అవినీతి పరులు, అవినీతి పార్టీ అంటూ నిత్యం వేదికలమీద దుమ్మెత్తి పోసే పవన్ కల్యాణ్ ఇప్పుడు ఆ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇస్తామని ముందుకు రావడం ఎంతవరకు సమంజసమని ఆ పార్టీ నేతలే తమ ఆంతరంగిక చర్చల్లో వాపోతున్నారట.
వేరే పార్టీ నేతలకు టికెట్లు ఇస్తామని చెప్పడం ద్వారా జనసేనాని పవన్ కల్యాణ్ ఎలాంటి సంకేతాలు పంపుతున్నారు? అంటే జనసేన అభ్యర్థులు కూడా లేనంత బలహీనంగా ఉందని మనకు మనమే చెప్పుకొన్నట్లవుతుంది కదాని జనసైనికలు, రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. జనసేన అధినేత వేస్తున్న రాజకీయ ఎత్తుగడ పార్టీకి ఎక్కడప్రతికూల ప్రభావాలను తీసుకొస్తాయోనని ఆ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట.వీటిపైన జనసేనాని ఎలా స్పందిస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.