జనసేన రాజకీయ పార్టీగా అవతరించి నాలుగేళ్లు దాటింది. ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపించినప్పటి నుంచే రాజకీయ కార్యకలాపాల్లో క్రియాశీలంగా ఉంటున్నాడు. అయినా ఇప్పటికీ జనసేన గానీ పవన్ గానీ రాజకీయాలు - సినిమాల మధ్య తేడాను గుర్తించలేకపోతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినీరంగంలో ఉండే పరిస్థితులనే రాజకీయాల్లో కూడా ఊహించుకుంటూ జనసేన నాయకులను దూరం చేసుకుంటోందని విశ్లేషిస్తున్నారు.
పవన్‌కు అతిపెద్ద బలం ఆయన అభిమానులే. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. జనసేనలో పెద్దగా పేరున్న నేతలను వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ప్రధానంగా తనకు నమ్మకస్తులు - కొందరు పాత్రికేయులకే పవన్ తన టీంలో చేర్చుకున్నాడు. ముఖ్యమైన వ్యవహారాలన్నింటినీ వారికే అప్పజెప్పాడు. నాయకులెవరైనా పవన్ ను కలవాలన్నా.. ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఆయనతో చర్చించాలన్నాఆ టీంకు ముందస్తు సమాచారం అందించాల్సిందే. వారి అనుమతి తీసుకోవాల్సిందే.
ఈ పరిస్థితే జనసేనకు ఇప్పుడు ప్రతికూలంగా మారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ టీం తీరుతో సీనియర్ నేతలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని - ఇరిటేట్ అవుతున్నారని చెబుతున్నారు. పవన్ టీం లోని చాలామంది రాజకీయాలకు కొత్త. అందులో ఎక్కువమంది సినీరంగానికి చెందినవారే. రాజకీయాలపై సరైన అవగాహన లేని ఆ టీం సభ్యులు.. పవన్ కు - తమ మధ్య అడ్డుగోడగా నిలుస్తున్నారని జనసేన సీనియర్ నేతలు ఇరిటేట్ అవుతున్నారట.
పవన్ టీం తమను ఏమాత్రం ఖాతరు చేయడం లేదని.. ప్రజల్లో తమ పలుకుబడిని గుర్తించడం లేదని జనసేన సీనియర్లు గుస్సా అవుతున్నారట. అధినేతను తాము కలవకుండా - ఆయనకు సరైన సమాచారాన్ని చేరవేయకుండా వారు అడ్డుపడుతున్నారని మండిపడుతున్నారట. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఓ సీనియర్ నేత పవన్ టీంపై తీవ్రంగా అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. పార్టీ పేరు చెప్పుకుంటూ పవన్ టీంలోని కొందరు డబ్బులు కూడా వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలు ప్రస్తుతం కలకలం సృష్టిస్తున్నాయి.
ఈ విషయాలపై పవన్ తక్షణమే దృష్టి పెట్టాలని.. లేదంటే జనసేన నిండా మునిగిపోవడం ఖాయమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. సినీ రంగంతో పోలిస్తే రాజకీయ రంగంలో పరిస్థితులు చాలా భిన్నంగా ఉంటాయని వారు సూచిస్తున్నారు. చిత్ర పరిశ్రమలో దొరికినంత గౌరవ మర్యాదలనే రాజకీయాల్లోనూ కోరుకుంటూ నాయకులను ఖాతరు చేయకపోతే పవన్ కు కష్టాలు తప్పవని హితవు పలుకుతున్నారు. మరి జన సేనాని ఇప్పటికైనా మేల్కొని తన టీం పనితీరును సరిదిద్దుతాడో లేదో వేచి చూడాల్సిందే!