జయలలిత మరణంపై అంతర్జాతీయ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రచురితమయ్యాయి. ఆమెకు ఉక్కు మహిళగా అభివర్ణిస్తూ... శక్తిమంతమైన నాయకురాలిగా కీర్తిస్తూ ప్రత్యేక కథనాలు ప్రచురించాయి. ప్రఖ్యాత 'ది వాషింగ్టన్ పోస్ట్' పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. "మా ప్రియమైన నేత - భారత ఉక్కు మహిళ... అమ్మ ఇకలేరు" అంటూ ఏఐఏడీఎంకే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆపై ప్రధాని మోదీ సంతాప సందేశాన్ని ప్రచురించింది. జయలలిత చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రస్తావిస్తూ, అమ్మ క్యాంటీన్లు - అమ్మ ఫార్మసీలు - అమ్మ వాటర్ - అమ్మ సిమెంట్ తదితరాలు తమిళులందరికీ జయను కన్నతల్లికన్నా ఎక్కువగా మారిపోయారని వెల్లడించింది. అతి తక్కువ డబ్బుతో కడుపు నిండా అన్నం పెట్టించిన ఘనత ఆమెదని వెల్లడించింది. అపోలో ఆసుపత్రిలో జయలలిత చేరినప్పటి నుంచి నిత్యమూ వేలాది మంది ఆసుపత్రి ఎదుట పడిగాపులు కాశారని, వీరి ప్రార్థనలకు దేవుడు కరగలేదని పేర్కొంది.
అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నప్పటికీ, ప్రజలు జయలలితను నమ్మి నాలుగు సార్లు అధికారాన్ని అప్పగించారని వెల్లడించింది. కోర్టు కేసులు, జైలు శిక్షలు ప్రజలకు ఆమెను దూరం చేయలేదని గుర్తు చేసింది. తాను నమ్మిన దారిలో పయనిస్తూ, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేసిన ఆమె మరణాన్ని తమిళులు తట్టుకోలేక పోతున్నారని వాషింగ్టన్ పోస్టు రాసింది.
- దక్షిణ భారత దేశ రాజకీయాల్లో శూన్యమేర్పడిందని న్యూయార్క్ టైమ్సు రాసింది. పాతికేళ్లుగా జయ ఎంత కీలక నేతగా ఉన్నారో వివరించింది. తమిళనాడును అక్షరాస్యతలో ముందు నిలిపి... శిశుమరణాలు తగ్గించిన ఘనత ఆమెదని ప్రత్యేకంగా ప్రస్తావించింది. పేదల కోసం ప్రవేశపెట్టిన పథకాలన్నిటి గురించి వివరించింది.
- బ్రిటన్ లోని ప్రఖ్యాత గార్డియన్ పత్రిక కూడా అమ్మ మరణాన్ని ప్రముఖంగా ప్రచురించింది. ఉక్కుమహిళ అంటూ కీర్తించింది.
- పాకిస్థాన్ లోని ప్రముఖ పత్రిక డాన్ లోనూ జయ మరణంపై వార్తలొచ్చాయి.
- మలేసియాకు చెందిన ది సన్ - శ్రీలంకలోని డైలీ న్యూస్ - సింగపూర్ లోని స్రెయిట్స్ టైమ్స్ వంటివి అమ్మ మరణంపై విస్తృత కవరేజి ఇచ్చాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/