ఎలన్​ మస్క్​ కు షాక్​ ఇచ్చిన ఇన్వెస్టర్లు..!!

Update: 2021-12-19 02:51 GMT
ప్రముఖ ఎలక్ట్రిక్​ కార్ల తయారీ సంస్థ అయిన టెస్లా అధినేత ఎలన్​ మస్క్​ ప్రస్తుతం ఇరకాటంలో పడ్డారు. ఒకే ఒక్క ట్వీట్​ తో అక్కడి షేర్ మార్కెట్ ను ఓ కుదుపు కుదిపేయగల వ్యక్తిగా పేరొందిన ఈ అపర కుబేరుడు అలాంటి ట్వీట్​ తో తల నొప్పిని కొని తెచ్చుకున్నారు. ఇటీవల మస్క్​ చేసిన ఓ ట్వీట్ పై కొందరు ఇన్​వెస్టర్లు కోర్ట్ ను ఆశ్రయించారు. అతను చేసిన ట్వీట్ పై ఉన్నత స్థాయిలో కమిటీ ఒకటి వేసి విచారణ జరిపాలను కోరుతున్నారు.  ఇందుక సంబంధించి కోర్టులో దావా వేశారు. ఆయన చేసిన ఈ ట్వీట్​ కారణంగా తాము చాలా నష్ట పోయామని పేర్కొన్నారు. ఎలాగైనా తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అసలు మస్క్​ చేసిన ట్వీట్​ ఏంటీ?  ఇన్వెస్టర్లు ఈ స్థాయిలో మండి పడడానికి గల కారణం ఏంటి? అసలు ఏం జరిగింది అనేది తెలుసుకుందాం.

టెస్లా, స్పేస్​ఎస్​ లాంటి ప్రముఖ దిగ్గజ కంపెనీలకు అధినేతగా వ్యవహరిస్తున్న వ్యక్తి ఎలన్​ మస్క్​. ప్రపంచంలో ఉంటే అపర కుబేరుడులో ఈయన ఒకరు. మస్క్ చేసే ట్వీట్​ లు తిమ్మిని బమ్మి, బమ్మిని  తిమ్మిని చేయగలవు. ఒక్క ట్వీట్​ తో ప్రపంచంలోనే అతి విప్లవాత్మక శక్తిగా పెరుగుతున్న బిట్​ కాయిన్ ను నేల చూపులు చూసేలా చేసిన ఏకైక వ్యక్తి. మరో ట్వీట్ తో అదే బిట్​ కాయిన్​ కు ఊపిరి ఊదిన వ్యక్తి కూడా ఇతడే. ఇంతకీ ఈయన చేసిన చేసే ట్వీట్​ లో ఏముంటుంది అని అనుకుంటున్నారా? బిజినెస్​ మహా అయితే ఏం చేస్తాడు  వ్యాపారం చేస్తాడు. మస్క్​ కూడా అదే చేశారు. కానీ ట్విట్​ లతో వ్యాపారం చేశారు. ఈయన చేసే ట్వీట్​ ను బట్టి చాలా కంపెనీల మార్కెట్​ వ్యాల్యూ అమాంత తగ్గడం, లేదా అమాంత పెరగడం లాంటి జరుగుతాయి.

ఇటీవల మస్క్​ వివిధ కారణాల వల్ల టెస్లా కార్ల కంపెనీలో ఉన్న తన వంతులో పది శాతం షేర్​ ను అమ్మేస్తున్నట్లు ఇదే ట్విట్టర్​ వేదికగా ట్వీట్ చేశాడు. పది శాతం మేర షేర్ అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇది డైరెక్ట్​ గా చాలా ప్రభావం చూపింది మార్కెట్​ లపై దీంతో చాల మంది ఇన్వెస్టర్లకు నష్టం కలిగింది. దీంతో వారంతా ఇప్పుడు మూకుమ్మడిగా కట్ట కట్టుకుని షేర్ల విక్రయించేశారు. ఈ భారీ కుదుపు ప్రభావం చాలా మందిపై పడింది. దీంతో కోర్ట్​ లో దావా వేశారు.

ఇదిలా ఉంటే ఈ అమెరికాను కార్ల కంపెనీ అయిన టెస్లా షేర్‌ వ్యాల్యూను తగ్గించే విషయంలో ఎలన్ మస్క్​ పై వివిధ కంపెనీలు ఈ సూట్​ ను దాఖలు చేశాయి. మస్క్​ చేసిన ట్వీట్​ ను కోట్​ చేస్తూ..  కోర్ట్​ లో పిల్ వేశారు. దీంతో యూఎస్ లోని ప్రముఖ కంపెనీలు కూడా మక్స్​ పై కన్నెర్ర చేశాయి. ఏదైనా ఓ నిర్ణయం ముందు నియంత్రణ సంస్థలకు సమాచారం ఇవ్వాలని కానీ ఇలా సోషల్​ మీడియాలో ట్వీట్​ చేయడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ మేరకు యూఎస్​లోని డెలావేర్ కోర్ట్​ లో పిటిషన్​ దాఖలు  చేశారు ఇన్వెస్టర్లు. ఇలాంటి రగడే గతంలో కూడా జరిగింది. వాటిని సెక్యురిటి స్టాక్స్​ ఎక్సేజీలు సమాచారం అందించారు.
Tags:    

Similar News