నాణ్యతకు కేరాఫ్ అడ్రస్ గా అభివర్ణిస్తుంటారు యాపిల్ ఉత్పత్తుల్ని. ఆ కంపెనీ నుంచి కొత్త ఉత్పత్తి బయటకు వస్తుందంటే గంటల తరబడి వెయిట్ చేసి మరీ కొనుగోలు చేస్తుంటారు. యాపిల్ కంపెనీ ఉత్పత్తుల్లో విశేష స్థానం ఉన్న ఐఫోన్లలో తాజాగా ఐఫోన్ 8.. 8ప్లస్ పేరిట కొత్త ఫోన్లు విడుదలైన సంగతి తెలిసిందే. కాస్త ఆలస్యంగా భారత్ లోకి అడుగుపెట్టిన ఈ ఫోన్ల మీద సంచలన ఫిర్యాదులు తెర మీదకు వస్తున్నాయి.
చైనా.. తైవాన్ దేశాల్లో ఐఫోన్8కి వినియోగించిన బ్యాటరీ మీద కంప్లైంట్లు వస్తున్నట్లుగా తైవాన్ మీడియా చెబుతోంది. ఐఫోన్ 8 ఫోన్ బ్యాటరీకి సంబంధించి ఇప్పటివరకూ మూడు ఘటనలు బయటకు వచ్చాయని.. ఇందులో ఒకటి తైవాన్‌లో మరొకటి చైనాలో.. ఇంకొకటి జపాన్‌లో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. తైవాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం ఐఫోన్ 8 బ్యాటరీ ఉబ్బిపోయిందని.. ఫోన్ ముందుభాగం ఊడి బయటకు వచ్చినట్లుగా వెల్లడించింది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనాలో చోటు చేసుకున్న మరో ఘటనలో ఫోన్ తన చేతికి వచ్చే సమయానికే బాడీ నుంచి స్క్రీన్ నుంచి విడిపోయిన విషయాన్ని వెల్లడించారు. ఇక.. తైవాన్ లో ఉంతాన్ని చూస్తే మిస్ వూ తాజాగా ఐఫోన్ 8 సిరీస్ లో 64 జీబీ స్టోరేజ్ ఉన్న రోజ్ గోల్డ్ ఐఫోన్ 8ప్లస్ ను కొనుగోలు చేశారు.
ఒరిజినల్ కేబుల్.. అడాప్టర్ తో ఛార్జింగ్ చేసిన మూడు నిమిషాలకే ఫోన్ ముందుభాగంగా ఉబ్బిపోయిన విషయాన్ని గుర్తించినట్లుగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా మరో వార్త హడావుడి చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ నోట్ 7కు బ్యాటరీ రూపొందించిన కంపెనీనే ఐఫోన్ 8కు కూడా బ్యాటరీ తయారు చేసి ఇచ్చినందన్న వార్తలు వస్తున్నాయి. శ్యాంసంగ్ గెలాక్స్ నోట్ 7 బ్యాటరీ పేలుళ్లకు కారణమైన కంపెనీకే ఐఫోన్ 8 బ్యాటరీలను తయారు చేయటానికి ఇచ్చారన్న వార్తపై యాపిల్ సంస్థ ఇంతవరకూ స్పందించలేదు. ఐఫోన్ ను అమితంగా ఆరాధించేవారికి తాజా వార్తలు శరాఘతంగా మారాయని చెప్పక తప్పదు.