తగ్గని ఇరాన్.. మళ్లీ అమెరికా పై అటాక్

Update: 2020-01-09 04:25 GMT
పశ్చిమ ఆసియాలో ఇరాన్ తగ్గడం లేదు. తమ సైన్యాధ్యక్షుడిని చంపిన అమెరికా సేనలపై ప్రతీకార దాడులను గురువారం కూడా కొనసాగిస్తోంది. ఇరాక్ లో ఉన్న అమెరికా సేనలపై రాకెట్లు, క్షిపణి దాడులతో విరుచుకుపడ్డ ఇరాన్ తాజాగా ఇరాక్ రాజధాని బాగ్దాద్ లోని అత్యంత రక్షణాత్మక ప్రాంతంగా భావించే గ్రీన్ జోన్ పై రాకెట్ దాడులకు దిగింది. అక్కడున్న అమెరికా రాయబార కార్యాలయాన్ని టార్గెట్ చేసి రాకెట్స్ ప్రయోగించింది. అయితే ఈ దాడిలో ఎవరూ గాయపడలేదని సమాచారం. ఈ దాడిలో పలు దేశాలకు చెందిన రాయబార కార్యాలయాలు ధ్వంసమైనట్టు తెలిసింది.

ఈ గ్రీన్ జోన్ లో అమెరికాతో చాలా వివిధ దేశాల రాయబార కార్యాలయాలు ఉన్నాయి. ఇది అత్యంత హైసెక్యూరిటీ జోన్ గా గ్రీన్ జోన్ గా ప్రకటించారు. ఐక్యరాజ్యసమితి బలగాలు కాపాలకాస్తుంటాయి. దీని పై ఇరాన్ దాడి చేయడం సంచలనమైంది.

ఇక ఇరాన్ దాడిలో తమ సైనికులు చని పోలేదని.. తాము యుద్ధాన్ని కోరుకోవట్లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన చేశాక కూడా ఇరాన్ దాడులు చేయడం సంచలనం గా మారింది. మరి అమెరికా ఈ ఇరాన్ దాడులను ఎలా కాచుకుంటుందనేది ఆసక్తి గా మారింది.
Tags:    

Similar News