ఇరాన్ దాడిలో 80మంది అమెరికా సైనికుల హతం

Update: 2020-01-08 09:18 GMT
అమెరికా పై ఇరాన్ ముప్పేట దాడి చేసింది. ఈ దాడిలో దాదాపు 80మంది అమెరికా సైనికులు చనిపోయారని ఇరాన్ ప్రకటించింది. వారిని అమెరికన్ ఉగ్రవాదులంటూ పేర్కొంది. తమ సైనిక చీఫ్ సోలేమానీ హత్యకు ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపింది.

ఇరాన్ సైనిక చీఫ్ సొలేమానీని అమెరికా వైమానిక దాడి చేసి చంపించింది. దీనికి ప్రతీకారంగా ఇరాక్ లోని అమెరికా సైనిక స్తావరాలు, శిబిరాలపై ఇరాన్ క్షిపణి దాడులు చేసింది.

ఇరాన్ ప్రయోగించిన 15 బాలిస్టిక్ క్షిపణులు లక్ష్యాన్ని చేధించడంలో సఫలమయ్యాయని.. ఈ దాడిలో అమెరికా హెలిక్యాప్టర్లు, సైన్యం సామగ్రి పూర్తిగా ధ్వంసమైందని.. దాదాపు 80మంది చనిపోయినట్లు తెలిపింది. ఇక అమెరికా ఎదురుదాడి చేస్తే తగిన సమాధానం చెప్పడానికి ఇరాన్ సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

ఇరాన్ క్షిపణులు ప్రయోగించి తమ సైనికులను చంపడాన్ని అమెరికా తీవ్రం గా ఖండించింది. ప్రపంచంలోనే ఎక్కడాలేని అత్యంత శక్తివంతమైన మిలిటరీ వ్యవస్థ తమకు ఉందని.. తాము చూస్తు ఊరుకోమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.

ఇక ట్రంప్ ప్రకటన పై ఇరాన్ కూడా తొడగొట్టింది. తమ పౌరుల రక్షణ కోసం ఎంతదాకా అయినా వెళ్తామని అమెరికా కు సవాల్ చేసింది.దీంతో అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధవాతావరణం నెలకొంది.
Tags:    

Similar News