మ‌న స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్ స్పూర్తితో పాక్‌ పై ఇరాన్ దాడి!

Update: 2017-05-08 17:59 GMT
పాకిస్తాన్ ఆగ‌డాల‌కు చెక్ పెట్టేందుకు మ‌న‌దేశం నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ స్ట్రైక్ ప‌లు దేశాల‌కు ఆద‌ర్శంగా మారుతున్న‌ట్లు క‌నిపిస్తుంది. తాజాగా ఇదే నిర్ణ‌యాన్ని ఇరాన్ బ‌హిరంగంగా హెచ్చ‌రించింది. మిలిటెంట్ల ఆగ‌డాల‌ను ఆప‌క‌పోతే తామే ప్ర‌త్య‌క్ష దాడుల‌కు దిగుతామ‌ని పాక్‌ను ఇరాన్‌ హెచ్చ‌రించింది. ఇరాన్‌-పాకిస్థాన్ స‌రిహ‌ద్దు వ‌ద్ద ఇటీవ‌ల ఉగ్ర‌వాదుల ఆగ‌డాలు ఎక్కువ‌య్యాయి. జైష్‌-అల్‌-అదిల్ మిలిటెంట్ సంస్థ ఇటీవ‌ల ఇరాన్ స‌రిహ‌ద్దు జ‌వాన్ల‌ను హ‌త‌మార్చింది. దీన్ని ఇరాన్ సీరియ‌స్‌గా తీసుకొని పొరుగు దేశమైన పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

పాకిస్థాన్‌లో ఉన్న‌ మిలిటెంట్లు లాంగ్ రేంజ్ గ‌న్నుల‌తో ఇరాన్ ద‌ళాల‌ను మ‌ట్టుబెట్టాయి. డ్ర‌గ్ స్మ‌గ్లింగ్ గ్యాంగ్‌లు, వేర్పాటువాద మిలిటెంట్ల‌తో ఇరాన్‌-పాక్ బోర్డర్ ఎప్పుడూ టెన్ష‌న్ టెన్ష‌న్‌గా ఉంటుంది. ఒక‌వేళ ఇలాగే ఉగ్ర‌వాదులు దాడులు కొన‌సాగిస్తే, తాము ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు చేస్తామ‌ని ఇరాన్‌కు చెందిన ర‌క్ష‌ణ మంత్రి తెలిపారు. దీంతో పాకిస్థాన్ దిగివ‌చ్చింది. స‌రిహ‌ద్దు వ‌ద్ద అద‌న‌పు భ‌ద్ర‌త కేటాయిస్తామ‌ని తెలిపింది. భార‌త్ నిర్వ‌హించిన స‌ర్జిక‌ల్ దాడుల త‌ర‌హాలో దాడి చేస్తామ‌ని ఇరాన్ హెచ్చ‌రించ‌డంతో పాక్ ఆర్మీ స్పందించిన‌ట్లు స‌మాచారం.
Tags:    

Similar News