అంబానీ ఫ్యామిలీలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. కానీ , ముఖేష్ అంబానీ తన వ్యాపార సామ్రాజ్యాన్ని రోజురోజుకి విస్తరించుకుంటూ ఎవరికీ అందనంత ఎత్తుకి దూసుకుపోతుంటే .. అనిల్ అంబానీ మాత్రం రోజురోజుకి పతనం వైపు నడుస్తున్నాడు. ఇప్పటికే పలు వ్యాపారాలలో తీవ్రంగా నష్టపోయిన అనిల్ అంబానీకి తాజాగా IRDAI మరో షాక్ ఇచ్చింది. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ ఆర్థికస్థితి బాగాలేని కారణంగా ఆ కంపెనీ మార్కెట్లో పాలసీలు విక్రయించడాన్ని IRDAI నిషేధించింది.
కంపెనీ ఆస్తులతో పాటు పాలసీదారులపై గల బాధ్యతలను రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్‌కు బదలీ చేయాలని తెలిపింది. ప్రస్తుత పాలసీదారుల క్లెయిమ్స్ అన్నింటిని ఆ కంపెనీ చెల్లిస్తుందని ఉత్తర్వుల్లో తెలిపింది. రిలయన్స్ హెల్త్ సాల్వెన్సీ మార్జిన్ మెరుగుపడే అవకాశాలు సమీప భవిష్యత్తులో లేవని, అందుకే వ్యాపార కార్యకలాపాలు జరిపితే పాలసీదారులు నష్టపోతారని తెలిపింది. .
2019 నవంబర్ 15వ తేదీ నుంచి బీమా వ్యాపారం అండర్ రైటింగ్‌ను నిలిపివేయాలని రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్‌కు IRDAI తెలిపింది. పాలసీలు విక్రయించవద్దని ఆంక్షలు విధించింది. ఈ విషయాన్ని కంపెనీ వెబ్ సైట్‌లో, శాఖల్లో ఈ విషయం కనిపించేలా ఉంచాలని IRDAI తెలిపింది. మిగిలి ఉన్న ఆస్తుల జోలికి వెళ్లకూడదని, నియంత్రణ సంస్థ నుంచి లిఖిత పూర్వక అనుమతి లేకుండా వాటిని విక్రయించవద్దని తెలిపింది. అదే సమయంలో రిలయన్స్ హెల్త్ ఇన్సురెన్స్ ఆస్తులు, అప్పులు సాధారణ ఇన్సురెన్స్ వ్యాపారం నుంచి వేరుగా ఉంచాలని రిలయన్స్ జనరల్ ఇన్సురెన్స్‌కు తెలిపింది.