బాధ్య‌త‌లేని జ‌నంః దేశంలో సగం మంది ఇలా చేస్తున్నార‌ట‌!

Update: 2021-05-21 01:30 GMT
దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో విజృంభిస్తోందో అంద‌రికీ తెలిసిందే. నిత్యం ల‌క్ష‌ల కేసులు న‌మోదవుతున్నా.. వేలాది మ‌ర‌ణాలు సంభ‌విస్తున్న విష‌యం కూడా తెలిసిందే. ఇంత‌జ‌రుగుతున్నా.. కొంద‌రు మాత్రం బాధ్య‌త లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇంత దారుణ ప‌రిస్థితుల్లోనూ దాదాపు 50 శాతం మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నార‌ట‌!

ఇక‌, మాస్కు ధ‌రించే వారిలో కూడా మెజారిటీ నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారని గుర్తించిది. దాదాపు 64 శాతం మంది ముక్కును స‌రిగా క‌వ‌ర్ చేయ‌ట్లేద‌ట‌. కొంత మంది మూతికి మాస్కును చుట్టేస్తుండ‌గా.. మ‌రికొద‌రు గెడ్డానికి ర‌క్ష‌ణ‌గా వాడుతున్నార‌ట‌. కేవ‌లం 7 శాతం మంది మాత్ర‌మే ప‌ద్ధ‌తిగా మాస్కులు వాడుతున్నార‌ని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.

జ‌నం ఈ విధంగా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం వ‌ల్లే క‌రోనా విజృంభిస్తోంద‌నే ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. మాస్కుల అవ‌స‌రం గురించి ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప‌లు మార్లు హెచ్చ‌రించిన విష‌యాన్ని కూడా అధికారులు గుర్తు చేస్తున్నారు. క‌ర్నాట‌క‌, బెంగాల్‌, మ‌హారాష్ట్ర వంటి చోట్ల పాజిటివిటీ రేటు దాదాపు 25 శాతంగా ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

ఇంత జ‌రుగుతున్నా.. జ‌నాల్లో బాధ్య‌త ఉండ‌ట్లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ప్ర‌జ‌లు ఇప్ప‌టికైనా స్పందించి ప‌ద్ధ‌తిగా మాస్కు ధ‌రించాల‌ని కోరుతున్నారు. అదేవిధంగా.. భౌతిక దూరం పాటించాల‌ని, శానిటైజేష‌న్ క్ర‌మం త‌ప్ప‌కుండా చేసుకోవాల‌ని సూచిస్తున్నారు. ఈ విధంగా చేయ‌డం ద్వారా దేశం నుంచి క‌రోనాను త‌రిమి కొట్టాల‌ని కోరుతున్నారు.
Tags:    

Similar News