ఈసారి 35 మంది అధికారుల్ని రిలీవ్‌ చేశారు

Update: 2015-07-08 10:17 GMT
ం ఉన్నా లేకున్నా.. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఎడతెగని పంచాయితీలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉన్నవి చాలవన్నట్లుగా మరిన్ని పంచాయితీలు షురూ కానున్నాయి. ఇప్పటికే విద్యుత్తు.. ఇరిగేషన్‌ శాఖలకు చెందిన ఏపీ అధికారుల్ని తెలంగాణ సర్కారు రిలీవ్‌ చేయటం తెలిసిందే. ఉభయ రాష్ట్రాల మధ్య ఎలాంటి ఒప్పందం లేకుండానే రిలీవ్‌లు జరుగుతున్నాయి.

దీంతో రిలీవ్‌ అయితే ఉద్యోగులకు ఏపీ సర్కారు తీసుకోవటం లేదు. దీంతో.. వారు న్యాయపోరాటానికి దిగుతున్నారు. ఇప్పటికే రెండు శాఖలకు చెందిన ఉద్యోగుల విషయంలో వివాదం నెలకొని ఉంటే.. తాజాగా తెలంగాణ వాణిజ్య పన్నుల శాఖకు చెందిన 35 మంది ఏపీ ఉద్యోగుల్ని రిలీవ్‌ చేసేవారు. రిలీవ్‌ అయిన వారంతా ఉన్నత ఉద్యోగులే కావటం గమనార్హం.

 అయితే.. వీరిని రిలీవ్‌ చేసినప్పటికీ.. ఆంధ్రా సర్కారు పోస్టింగ్‌ ఇవ్వటం లేదు. దీంతో వీరి పరిస్థితి ఇప్పుడు అయోమయంగా మారింది. ఇలా ఒక పద్ధతి పాడు లేకుండా ఏ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వం ఉద్యోగుల్ని రిలీవ్‌ చేస్తే ఇబ్బందులు తప్పవని చెబుతున్నారు.

Tags:    

Similar News