దేశంలోని అన్నీ ఎయిర్ పోర్టులను తన గుప్పిట్లోనే ఉంచుకోవాలని అదానీ గ్రూపు నిర్ణయించుకున్నట్లుంది. ఇక్కడే వడ్డించేవాడు మనవాడైతే అన్న సామెత గుర్తుకొస్తోంది. కేంద్రప్రభుత్వం మద్దతు నూరుశాతం ఉన్నపుడు ఏ సంస్ధయినా ఏ రంగంలో అయినా దూసుకుపోవటంలో ఆశ్చర్యమేముంది. ఇప్పటికే దేశంలోని ఏడు విమానాశ్రయాలు అదానీ గ్రూపుచేతిలో ఉన్నాయి. తొందరలోనే మరో 12 ఎయిర్ పోర్టులను నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయబోతోంది. ప్రైవేటీకరణ అవబోయే ప్రతి విమానాశ్రయాన్ని అదానీ గ్రూపే చేజిక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.
అదానీ గ్రూపులోని ఎయిర్ పోర్ట్స్ డివిజన్ సీఈఓ అరుణ్ బన్సల్ మీడియాతో మాట్లాడుతు కేంద్రం ప్రైవేటీకరించబోయే విమానాశ్రయలకు తాము కూడా బిడ్లు వేయబోతున్నట్లు చెప్పారు.
తొందరలోనే ప్రైవేటీకరించబోయే 12 విమానాశ్రయాలను దక్కించుకునేందుకు తమ గ్రూపు ప్రయత్నాలు చేస్తుందన్నారు. అంటే ఓపెన్ బిడ్లు వేసే సంస్ధల్లో అదీనీ గ్రూపు ఉందంటే బిడ్ దాదాపు ఈ సంస్ధకు దక్కినట్లే అనుకోవాలి. ఏ కారణంగా అదానీ గ్రూపుకు బిడ్ దక్కకపోతే ఏదోరూపంలో దక్కించుకోవటం ఖాయం.
ఇప్పుడు తమ ఆధీనంలో ఉన్న ఏడు ఎయిర్ పోర్టులను ఈ విధంగానే అదానీ గ్రూపు దక్కించుకున్న విషయం తెలిసిందే. ఓడరేవులు, విమానాశ్రయాలు, జాతీయ రహదారుల ప్రాజెక్టులు ఇలా ఒకటేమిటి అన్నీ రంగాల్లోను అదానీ దూసుకుపోతున్నారు. దీనికి ముఖ్య కారణం ఏమిటంటే నరేంద్రమోడీ అపారమైన మద్దతే అని ప్రతిపక్షాలు నానా రచ్చ చేస్తున్నాయి. జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ప్రతిపక్షాల ఆరోపణలు నిజమేనేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.
ఒకవైపు అంతర్జాతీయంగా అదానీ గ్రూపు అతలాకుతలం అయిపోతోంది. హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత గ్రూపు ఆర్ధికపరిస్దితిపై ప్రపంచవ్యాప్తంగా అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. హిండెన్ బర్గ్ నివేదికపై పార్లమెంటులో చర్చ జరగాలని ప్రతిపక్షాలు ఎంత గోలచేస్తున్నా మోడీ ఏమాత్రం పట్టించుకోవటంలేదు.
దేశం మొత్తాన్ని అదానీ గ్రూపుకు దోచిపెట్టేస్తున్నారంటు దేశంలో గోల జరుగుతున్నా మోడీ ఏమాత్రం లెక్కచేయటంలేదు. తమ గ్రూపు ఆర్ధికపరిస్ధితిపై ఇంత గోల జరుగుతున్నా కొత్తగా 12 విమానాశ్రయాలను దక్కించుకునేందుకు బిడ్లు వేస్తామని గ్రూపు ప్రకటించిందంటే అర్దమేంటి .