ఏపీలో బీజేపీకి ఏముంది అంటే ఏమీ లేదు అని జవాబు చెప్పాలి. పాయింట్ జీరో ఎయిట్ పెర్సెంట్ ఓట్లను 2019 ఎన్నికల్లో బీజేపీ సాధించింది. దాదాపుగా పోటీ చేసిన అన్ని చోట్లా డిపాజిట్లు గల్లంతు అయ్యాయి. ఈ రోజుకీ సొంతంగా గెలిచిన ఒక ఎంపీ గాకీ ఎమ్మెల్యే కానీ ఏపీలో ఆ పార్టీకి లేరు. మరి అంతటి దీనావస్థలో ఉన్న బీజేపీకి ఏపీలో మాత్రం రాజకీయ పలుకుబడి అపారంగా ఉందంటే ఆశ్చర్యపోవాల్సిందే కదా.
బీజేపీలో ఏపీలో తన రాజకీయ హవా మాత్రం సూపర్ గా నడిపిస్తోంది. దానికి కారణం కేంద్రంలో బలంగా బీజేపీ ఉండడం, అధికారాన్ని చలాయించడమే. 2019 ఎన్నికలనే తీసుకుంటే బీజేపీ ఏపీ ఎన్నికల్లో టీడీపీకి ఏ రూపేణా ఏ కోశానా డబ్బులు అందకుండా చేసిందింది. అలా టీడీపీకి విజయావకాశాలు లేకుండా చావు దెబ్బ తీసింది. దానికి వ్యవస్థలను అడ్డం పెట్టుకుంది అని ప్రచారంలో ఉన్న మాట.
ఇక అదే టైం లో గెలిచే నాయకులను, సత్తా ఉన్న వారిని, బలమైన లీడర్స్ ని బీజేపీ దగ్గరుండి మరీ వైసీపీలోకి పంపించింది అని కూడా అంటారు. ఆ కారణంగా 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అత్యంత బలంగా మారింది. అన్ని రకాలైన వనరులు, కేంద్ర ప్రభుత్వం ఫుల్ సపోర్ట్ తో బీజేపీ ఏపీలో గెలుపు బావుటా ఎగురవేసింది అనే చెప్పాలి.
మరో వైపు జగన్ని చూస్తే ఆయన తన మీద ఉన్న సీబీఐ కేసుల కారణంగా కేంద్ర పెద్దలతో తప్పనిసరిగా స్నేహం చేయాల్సివస్తోంది అని అంటున్నారు. ఆ విధంగా ఏపీలో సీఎం జగన్ అయినా కూడా కేంద్రంలో మోడీకి జై కొడుతూ ప్రతీ దానికి బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఇది బహిరంగ రహస్యమే. అందరికీ తెలిసిన విషయమే. వైసీపీ మద్దతుతో చాలా బిల్లులను పార్లమెంట్ లో గట్టెక్కించుకున్న చరిత్ర బీజేపీది. మరి ఈ బంధం వెనక అనేక రాజకీయాలు ఉన్నాయని కూడా చెబుతారు.
ఇపుడు చూస్తే చంద్రబాబు సైడ్ బీజేపీ చూస్తూ కన్నుకొడుతోంది. మూడేళ్ల క్రితం ఇదే బాబుని ఆయన పార్టీని పక్కన పెట్టి అతి దారుణంగా ఓడించిన బీజేపీ పెద్దలకు ఇపుడు ఆయన మీద ప్రేమ కలుగుతోంది. దానికి కారణం ఫక్తు రాజకీయాలే తప్ప మరేమీ కాదు అని అందరికీ తెలుసు. ఒక వైపు విపక్షం జాతీయంగా చూస్తే బలపడుతోంది. ఆ టైం లో బాబు లాంటి టాలెంట్ ఉన్న వారు ఏక మొత్తంగా విపక్ష కూటమికి కట్టించగలిగిన వారు కనుక ఉంటే అది బీజేపీకి పెద్ద ముప్పుగా మారుతుంది.
అందుకే ఆ ఆలోచనలు అన్నీ కలిగాక లెక్కలు బేరీజు వేసుకున్నాక ఈ మధ్యన ఢిల్లీ వెళ్ళిన బాబుతో నరేంద్ర మోడీ చేతులు కలిపారు. షేక్ హ్యాండ్ కూడా ఇచ్చారు. అపుడపుడు వచ్చి కలుస్తూ ఉండండి అని కూడా సందేశాలు పంపుతున్నారు. అంటే బాబుని కూడా తమ ట్రాప్ లోకి తెచ్చుకుని టోటల్ ఏపీ రాజకీయం మొత్తం తమవైపే ఉందనిపించుకునే ఎత్తుగడ ఇది.
ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో సాగుతోంది ఈ తరహా పాలిటిక్స్. నిజానికి ఎక్కడైనా అధికార ప్రతిపక్షాలు వేరు వేరు కూటములు కడతాయి. ఎందుకంటే ఒకరితో ఒకరికి పడదు కాబట్టి. బీజేపీతో జగన్ ఉన్నారంటే బాబు కచ్చితంగా విపక్ష కూటమిలోకి చేరుతారని అంతా అనుకుంటారు. కానీ బాబు 2019 నాటి చేదు అనుభవాలతో కేంద్రంలోని బీజేపీ తనకు ఉన్న బలమైన వ్యవస్థల ద్వారా మరోమారు ఇబ్బంది పెడితే ఈసారితో తన రాజకీయ జీవితం మొత్తం మటాష్ అవుతుంది అన్న ఆలోచనతోనే బాబు కూడా బీజేపీ కన్ను గొట్టుడికి పడిపోతున్నారు.
సరే బాబుతో బీజేపీ షేక్ హ్యాండ్ ఇచ్చింది ఆయన్ని మరలా దగ్గరకు తీస్తోంది కదా బాబుతో ఏపీలో రాజకీయ వైరం భీకరంగా ఉంది కదా మన దారి మనం చూసుకుందామని వైసీపీ కానీ జగన్ కానీ అసలు అనుకోవడం లేదు. బాబు మోడీకి ఆ పక్కన నిలబడితే ఈ వైపు ఖాళీగానే ఉంది కదా అని సర్దుకుని మరీ నిలబడుతున్నారు. అంటే అంతటి రాజకీయ అనివార్యత బీజేపీ వారికి కల్పించిందా లేక ఇలా ఎవరికి వారే బీజేపీని బలమైన పార్టీగా చూసుకుంటూ తమను తాము తక్కువ చేసుకుంటున్నారా అన్నది కూడా అర్ధం కావడంలేదు అంటున్నారు.
ఉదాహరణకు జగన్ బీజేపీకి తలాఖ్ చెప్పి కేసీయార్ తరహాలో ఎదిరించి నిలబడితే జనం పూర్తిగా ఆయనకు మద్దతుగా ఉంటారు కదా. ఎనిమిదేళ్ళుగా విభజన హామీలు అమలు చేయని బీజేపీతో కయ్యానికే ఏపీ జనం మూడ్ అనుకూలంగా ఉంటుందని జగన్ కి తెలియదా. ఇక కేసుల విషయం తీసుకుంటే ఏమవుతుంది. ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పినట్లుగా మరోసారి జైలు కి వెళ్ళినా జగన్ మీద సింపతీ వస్తుంది తప్ప అంతకు మించి ఏమీ జరగదు కదా.
మరి ఆ విధంగా పోరాడితే జనం మద్దతు ఫుల్ గా ఉంటుందని తెలిసి కూడా జగన్ ఎందుకు బీజేపీకి ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు అన్నది ఏపీ జనాలకు అర్ధం కాని విషయం. ఇంకో వైపు చంద్రబాబు. రాజకీయంగా ఆయన తలపండిన వారు. ఈ రోజు దేశంలో మోడీ ని వ్యతిరేకించే పార్టీలే ఎక్కువగా ఉన్నాయి.
అయితే అవి తలో దిక్కుగా ఉన్నాయి. ఈ టైం లో 1996 మాదిరిగా యునైటెడ్ ఫ్రంట్ లాంటిది ఏర్పాటు చేయాలి. అందరినీ ఒకే చోటకు చేర్చి బీజేపీకి వ్యతిరేకంగా నిలబెడితే కచ్చితంగా బీజేపీకి అది రాజకెయంగా చావు దెబ్బ అవుతుంది. ఆ విధంగా బాబు కూడా జాతీయ స్థాయిలో వెలిగిపోతారు. బాబుకు ఉన్న పరిచయాలు అనుభవాలు చూసుకున్నపుడు ఇది ఆయన వల్లనే సాధ్యమని అంతా అంటారు.
కానీ బాబు దేశం ఏమైపోతేనేమి నాకు ఏపీయే ముఖ్యమని అనుకుంటున్నారు. బీజేపీకి దూరంగా ఉంటే కేసులు ఏమైనా పెడతారు అన్న వెరపు ఉన్నట్లుగా ఉంది. అందుకే దేశ జనుల మనోభవాలకు, ఏపీ జనాల భావాలకు కూడా యాంటీగా ఆయన బీజేపీ దయ కోరుకుంటున్నారు. ఈ విధంగా బాబు సైతం కమలానికి జై అంటున్నారు. నిజానికి బాబుకు ఈ సమయంలో జగన్ కంటే రాజకీయంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఆయన మోడీ జపం మానేస్తే కచ్చితంగా టీడీపీకి ఏపీలోనే కాదు దేశంలో కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ బాబు ఆ సంగతి గమనంలోకి తీసుకోవడంలేదు అంటున్నారు. ఆయన ఎంతసేపూ జగన్నే చూస్తున్నారు. జగన్ సైతం బాబును తలచుకుంటూ బీజేపీ వైపు ఉంటున్నారు. ఇలా రెండు పార్టీలు తనతో ఉండడం వల్లనే ఏపీలో సీఎం సీటు తనదే అని బీజేపీ భావిస్తోంది అంటే తప్పుంద.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.