కాంగ్రెస్ దారిలో బీజేపీ వెళుతోందా?

Update: 2022-06-14 08:35 GMT
తొండ ముదిరి ఊసరవెల్లి అయ్యిందనే సామెత లాగా తయారైంది బీజేపీ. రెండు రకాలుగా కాంగ్రెస్ పార్టీని బీజేపీ ఫాలో అయిపోతోంది. కేంద్ర దర్యాప్తు సంస్ధలను దుర్వినియోగం చేస్తోందని, రాజకీయప్రత్యర్ధులపైకి సీబీఐ, ఈడీలను ఉసిగొల్పొతోందని ఒకపుడు కాంగ్రెస్ పై బీజేపీ నేతలు రెగ్యులర్ గా రచ్చ రచ్చ చేసేశారు. అలాంటిది ఇపుడు బీజేపీ కూడా అదే దారిలో వెళుతోంది. ప్రత్యర్ధులపైకి దర్యాప్తసంస్ధలను ఉసిగొల్పటం, తమకు మద్దతుగా మారినవారి విషయంలో దర్యాప్తును  చూసీచూడనట్లు వదిలేస్తోంది.

అంటే బీజేపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతోందన్న విషయం  అర్ధమైపోతోంది. వివిధ రాష్ట్రాల్లో సీబీఐ, ఈడీ ఉన్నతాధికారులు చేస్తున్న దాడులు, దర్యాప్తు చేస్తున్న విధానాలను గమనిస్తే ఈ విషయం స్పష్టంగా తెలిసిపోతోంది. ఇక రెండోదేమిటంటే ప్రభుత్వాలను కూల్చేయటం, అస్ధిరపరచటం, ఎంఎల్ఏలను లోబరుచుకోవటం. దర్యాప్తు సంస్ధలను బీజేపీ ఎంతగా దుర్వినియోగం చేస్తోందనే ఆరోపణలను ఎదుర్కొంటోందో రెండో విషయంలో కూడా అచ్చంగా కాంగ్రెస్ నే ఫాలో అయిపోతోంది.

ముందు కర్నాటకతో బీజేపీ తన ఆపరేషన్ను మొదలుపెట్టింది. కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వాన్ని కూలదోసింది. రెండు పార్టీల్లోని ఎంఎల్ఏల్లో కొందరిని లాగేసుకుంది. తర్వాత మధ్యప్రదేశ్ లో 28 మంది ఎంఎల్ఏలను లోబరుచుకుని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింది. కొద్దిరోజులుగా రాజస్థాన్ లోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

కొందరు ఎంఎల్ఏలను గోకుతోందికానీ ఎవరు పడటం లేదు. మహారాష్ట్రలోని మహా వికాస్ గడీ అంటే శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కూడా ప్రయత్నాలు చేస్తోంది.

ఇలా ఎక్కడికక్కడ ప్రత్యర్ధి పార్టీలకు చెందిన ఎంఎల్ఏలను లాగేసుకోవటం,  ప్రభుత్వాలను కూల్చటం, అవకాశముంటే తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే టార్గెట్ గా పావులు కదుపుతోంది. ఆ మధ్య పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఎంఎల్ఏలను లాగేసుకుని పార్టీలో ప్రభుత్వంలో మమతపై తిరుగుబాటు వచ్చేట్లు చేసి తర్వాత ప్రభుత్వాన్ని కూల్చేయాలని ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు.

మొత్తం మీద పైకి ప్రజాస్వామ్యం, విలువలంటు నీతులు చెబుతున్న  నరేంద్రమోడి చేతల్లో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. 70 ఏళ్ళ అధికారంలో  కాంగ్రెస్ కు ఎన్ని దుర్లక్షణాలు వచ్చాయో 8 ఏళ్ళ మోడి పాలనలో బీజేపీకి అంతకుమించి దుర్లక్షణాలు వచ్చేశాయి.
Tags:    

Similar News