అమరావతి రాజధానిగా తాజాగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభ తర్వాత హ్యాపీగా ఫీలైన వ్యక్తి ఎవరైనా ఉంటే అది చంద్రబాబునాయుడే అనటంలో సందేహం లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కి వ్యతిరేకంగా రాష్ట్రంలోని ప్రతిపక్షాలన్నీ ఒక వేదిక మీదకు రావటం ఇదే మొదటిసారి. వేదిక మీద కనిపించిన పార్టీల్లో దేని అజెండా దానిదే అయినా అమరావతి అనే కామన్ పాయింట్ కారణంగా మాత్రమే చేతులు కలిపాయి.
జగన్ కు వ్యతిరేకంగా ప్రతి పక్షాలన్నింటినీ ఏకంచేయాలనే ఆలోచన చంద్రబాబు చాలాకాలంగా చేస్తున్నారు. కానీ అవకాశమే దొరకలేదు. అందుకనే వ్యూహాత్మకంగా న్యాయస్థానం టు దేవస్ధానం అనే కార్యక్రమం విజయవంతం అయిన సందర్భంగా తిరుపతిలో జరిగిన బహిరంగ సభలో అవకాశం దొరికింది.
బహిరంగసభ జరగటం చూసిన తర్వాత చంద్రబాబు హ్యాపీగానే ఫీలయ్యుండాలి. ఎందుకంటే గడచిన రెండున్నరేళ్ళుగా ప్రతిపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చిందే లేదు. ఎన్నిరకాలుగా ప్రయత్నించినా ప్రతిపక్షాలను ఒకే వేదికమీదకు తీసుకురావటం సాధ్యంకాలేదు. అందుకనే అమరావతి పాయింట్ ను తీసుకొచ్చారు. జగన్ మూడు రాజధానుల కాన్సెప్టును ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న కారణంగా అమరావతి పాయింట్ మీద ఒకే వేదికను పంచుకోవటం సాధ్యమైంది.
అయితే ప్రతిపక్షాల మధ్య ఈ ఐక్యత ఎంతకాలం ఉంటుందనేదే ప్రశ్న. ఎందుకంటే ప్రతిపక్షాల్లో చాలావాటికి దేనికదే ప్రత్యేకమైన అజెండాలున్న విషయం అందరికీ తెలిసిందే. ఇపుడు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ+జనసేన బంధమే ఎప్పుడు విడిపోతుందో అనేట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ దశలో మిగిలిన పార్టీల్లో ఐక్యత లేదా పొత్తు ఎలా సాధ్యమో ఎవరికీ అర్ధం కావటంలేదు. నిజంగానే కొన్నిపార్టీల మధ్య పొత్తుకుదిరినా అదికూడా టీడీపీతో పొత్తుకుదిరితే చంద్రబాబు ఫుల్లు హ్యాపీ అనే చెప్పాలి.
మరి ఈ దశలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకునేందుకు ఏ పార్టీ సిద్ధంగా ఉందన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఆల్రెడీ అన్నీ పార్టీలకు టీడీపీతో పొత్తుల అనుభవం చాలానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే వామపక్షాలు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అసలు ఓటుబ్యాంకన్నదే లేదు. వీటితో పొత్తు పెట్టుకుంటే టీడీపీ ఎంత నష్టపోతుందో చంద్రబాబు బాగా తెలుసు. ఇక బీజేపీ, జనసేనల గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరమే లేదు. పైకి మిత్రపక్షాలే అయినా లోలోపల రెండు పార్టీలు దేని కదే అన్నట్లుగా వ్యవహారాలు నడుపుతున్నాయి. ఈ రెండింటితో పొత్తుపెట్టుకున్నా చంద్రబాబుకు ఇబ్బందే. ఎందుకంటే ఈ రెండుపార్టీల్లో జనసేనకు మాత్రమే కాస్త ఓటింగ్ ఉంది. మరి చివరకు ఏమవుతుందన్నది ఇంట్రస్టింగే.