డీఎల్ సార్‌కి పొలిటిక‌ల్ డీల్ కుద‌ర‌ట్లేదా?

Update: 2022-08-27 10:52 GMT
ఆయ‌న మాజీ మంత్రి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌ని దృఢంగా నిర్ణ‌యించుకున్నారు. అయితే.. పార్టీ ఏంట‌నేది ఇప్పుడు ఆయ‌న‌కు సంక‌టంగా మారింది. ఆయ‌నే డీఎల్ ర‌వీంద్రారెడ్డి. క‌డ‌ప జిల్లా మైదుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నాయ‌కుడు. డాక్ట‌ర్ ఎమ్మెల్యేగా ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపు కూడా ఉంది.

సుదీర్ఘ కాలం రాజ‌కీయాల్లో ఉండ‌డ‌మే కాదు.. వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్న వైట్ కాల‌ర్ నాయ‌కుడిగా పేరుతెచ్చుకున్నారు. నిజాయితీ ప‌రుడు. బ‌ల‌మైన నాయ‌కుడైన‌ వైఎస్‌తో విభేదించినా.. ఆయ‌న కాంగ్రెస్‌లో ప‌ట్టు పెంచుకున్నారు. వైఎస్ అనంత‌రం ఏర్ప‌డిన కిర‌ణ్‌కుమార్ ప్ర‌భుత్వంలో మంత్రి అయ్యారు.

అయితే.. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌.. ఆయ‌న రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. వాస్త‌వానికి ఆయ‌నకు టీడీ పీ నుంచి ఆహ్వానం అందింది. అదేస‌మ‌యంలో వైసీపీ నుంచి కూడా పిలుపు వ‌చ్చింద‌ని ప్ర‌చారం ఉంది. కానీ, ఎందుకో, ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ దూరంగా ఉన్నారు.కానీ, ఇటీవ‌ల కాలంలో మాత్రం త‌న రాజ‌కీయ రంగ ప్ర‌వేశంపై మాత్రం ఆయ‌న క్లూ ఇస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి రెడీ అవుతున్నారు. అయితే... పార్టీ ఏద‌నేదే.. ఇప్పుడు ఆయ‌న‌కు సందేహం.

టీడీపీలోకివెళ్లాల‌ని ఉన్నా.. పార్టీలో చేరేందుకు ఆయ‌న ఇష్ట‌ప‌డ‌డం లేదు. ఆయ‌న‌క‌న్నా.. జూనియ‌ర్లకింద ప‌నిచేయాల‌నే భావ‌నో.. లేక‌పోతే.. వెళ్లినా.. మైదుకూరు టికెట్ ఇప్ప‌టికే పుట్టా సుధాక‌ర్ యాదవ్‌కు రిజ‌ర్వ్ అయిపోయింద‌ని ఆవేద‌నో..  ఏదో తెలియ‌దు కానీ.. ఆయ‌న చూపు మాత్రం బీజేపీపై ఉంది. ఇటీవ‌ల ఆయ‌న సీఎం ర‌మేష్‌తో భేటీ కావడం..  ఆస‌క్తిగా మారింది. అంతేకాదు.. పార్టీలో చేరేందుకు ఉత్సాహంగా ఉన్నాన‌నే సంకేతాలు వ‌స్తున్నాయి.

అయితే ఇప్పుడు ఈ విష‌యంలోనూ ఆయ‌న డోలాయ‌మానంలో ప‌డ్డార‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి బీజేపీ ఒంట‌రిగా పోటీ చేస్తేనే తాను పోటీ కి దిగుతాన‌ని.. లేక‌పోతే స్వ‌తంత్రంగా అయినా.. పోటీ చేస్తాన‌ని ఆయన చెబుతున్నారు.

దీంతో ఈ మాజీ మంత్రి ఎటు వెళ్తార‌నే చ‌ర్చ జోరుగా జ‌రుగుతోంది. మ‌రి చివ‌ర‌కు ఏం చేస్తారో చూడాలి. ఏదేమైనా మైదుకూరులో డీఎల్ పోటీ మాత్రం ఖాయ‌మేన‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. అయితే.. ఒంట‌రిపోరు.. ఇప్పుడున్న ప‌రిస్థితిలో స‌రికాద‌నేది వీరి వాద‌న కూడా!!
Tags:    

Similar News