వాళ్ళు కలిస్తేనే ప్రభుత్వానికి ఇబ్బందే ?

Update: 2022-02-04 04:59 GMT
ఈ నేపథ్యంలోనే ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు, ఉపాధ్యాయులు నిరవధిక సమ్మె మొదలు పెట్టబోతున్నారు. ఉద్యోగులు ఇంకా కొన్ని రోజులు సమ్మె చేసినా ప్రభుత్వం పెద్దగా పట్టించుకునే దాఖలాలు కనబడటం లేదు. ఎందుకంటే ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎన్ని రోజులు సమ్మె చేసినా జనజీవనం నిలిచిపోయే అవకాశాలు తక్కువే. జనాలు తమ అవసరాలను కొద్దిరోజుల పాటు వాయిదాలు వేసుకుంటారు కాబట్టి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది కూడా ఏమీ లేదు.

అయితే ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమ్మెలోకి విద్యుత్, ఆర్టీసీ యూనియన్లు కూడా దిగితే మాత్రం ప్రభుత్వానికి సెగ మొదలవుతుంది. ఆర్టీసీ బస్సులు తిరగడం ఆగిపోతే జనాల రాకపోకలకు బ్రేక్ పడిపోతుంది. అలాగే విద్యుత్ సమస్యలు తలెత్తితే రిపేర్లు చేయటానికి ఎవరు అందుబాటులోకి రాకపోతే జనాలు అంధకారంలో ఉండాల్సొస్తుంది. దీనివల్ల జనాలు బాగా ఇబ్బంది పడతారు. జనాలకు ఇబ్బందులు మొదలైందంటే దాని సెగ ప్రభుత్వానికి తగులుతుంది.

ఒకసారి సెగ తగలటం మొదలైతే ప్రభుత్వం ఇప్పుడున్నంత స్థిమితంగా ఉండలేదు. అయితే ఆ సెగ తగులుతుందా అనేదే అనుమానం. ఎందుకంటే ఆర్టీసీలో సమ్మె చేసే విషయంలో మిశ్రమ స్పందన ఉంది. బలమైన యూనియన్లలో కొన్ని సమ్మె చేయాల్సిన అవసరం లేదని అంటున్నాయట. ఎండీని కలిసి తాము సమ్మెలోకి వెళ్లడం లేదని రాతపూర్వకంగానే చెప్పినట్లు సమాచారం.

 అలాగే విద్యుత్ ఉద్యోగులు కూడా సమ్మె విషయంలో ఏకతాటిపైన లేరట. కాబట్టి పై రెండు సంస్థల ఉద్యోగులు నూరుశాతం సమ్మెలోకి దిగనంతవరకు ప్రభుత్వానికి సెగ తగలదన్నది వాస్తవం.
Tags:    

Similar News