ఆన్‌లైన్ ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ న్యూస్ వెబ్‌సైట్లను సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఆన్‌లైన్‌లో సినిమాలు అందించే కంటెంట్ ప్రొవైడర్లు’, ‘న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ కంటెంట్ అందించే ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లు' ఈ శాఖ పరిధిలోకి వస్తాయని ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే, ఓటీటీ, ఆన్ లైన్ న్యూస్ వెబ్ సైట్లు తదితరాలను కేంద్రం ఎలా నియంత్రిస్తుందన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఓటీటీ, డిజిటల్ న్యూస్ మీడియాపై కేంద్రం తాజా నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపబోతోందన్నదానిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+ హాట్‌స్టార్, ఆహా వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్ లు, అనేక డిజిటల్ వార్తల వెబ్‌సైట్లపై దీని ప్రభావం ప్రత్యక్షంగా ఉండబోతుందన్నది అంచనా వేస్తున్నారు.
అయితే, డిజిటల్ మీడియా, న్యూస్ కంటెంట్ పై సెన్సార్ షిప్ ఉంటుందా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదు. ప్రభుత్వ విధానాల రూపకల్పనను విడిగా చూడకూడదు. అయితే, డిజిటల్ మీడియాను నియంత్రించే ముందు కేంద్రం తమతో చర్చిస్తుందని ఆయా సంస్థలు ఆశిస్తున్నాయి. విదేశాల నుంచి ఆపరేట్ చేస్తూ భారత్ లో ఉన్న సంస్థలపై కూడా ఆంక్షలు ఉండవచ్చని అనుకుంటున్నారు. కొత్త చట్టాలు డిజిటల్ మీడియాపై ఆంక్షల రూపంలో కాకుండా ఫేక్ న్యూస్, అడల్ట్ కంటెంట్ నియంత్రణ దిశలో ఉంటే డిజిటల్ పరిశ్రమ వృద్ధి చెందుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కేబుల్ టీవీ చట్టానికి జతగా 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాన్ని కలిపి డిజిటల్ మీడియాను నియంత్రణ చేయాలన్న యోచన కేంద్రానికి ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. అయితే, అరచేతిలో ప్రపంచం ఉన్న ఈ రోజుల్లో ఇంటర్నెట్‌లో కంటెంట్‌ను ఎలా నియంత్రిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.