భార‌త ర‌క్ష‌ణ రంగాన్ని మేకిన్ ఇండియా ముంచేస్తోందా?

Update: 2022-09-09 02:30 GMT
కేంద్రంలో న‌రేంద్ర మోడీ స‌ర్కారు కొలువుదీరిన‌ప్ప‌టి నుంచి అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తున్న విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో మేకిన్ ఇండియాను తీసుకువ‌చ్చ‌రు. మ‌హాత్మా గాంధీ బ్రిటీష్ హ‌యాలో నిర‌స‌న‌గా తీసుకువ‌చ్చిన స్వ‌దేశీ వ‌స్తు వినియోగాన్ని అటు ఇటు మార్చి.. స్వ‌దేశీ వ‌స్తు త‌యారీని.. మోడీ ప్ర‌వేశ పెట్టారు. దేశంలో త‌యారీ రంగానికి ఊతమిస్తున్నామ‌ని.. విదేశాల నుంచి దిగుమ‌తులు త‌గ్గించుకోవ డం ద్వారా... ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌డంతోపాటు.. మేకిన్ ఇండియా ద్వారా.. దేశంలో స్టార్ట‌ప్‌ల‌కు ఊత‌మిస్తున్నా మ‌ని.. ఆయ‌న చెబుతున్నారు.

ఇది ఒక‌ర‌కంగా మంచిదే. ప్ర‌తిదానికీ విదేశాల‌పై ఆధార‌ప‌డ‌కుండా.. చేసే ప‌రిమాణం.. మంచిదే. కానీ, దీనిని ఏకంగా..దేశ ర‌క్ష‌ణ రంగానికి కూడా ముడిపెట్ట‌డం.. ర‌క్ష‌ణ రంగానికి అవ‌స‌ర‌మైన ఆయుధాల‌ను కూడా స్వ‌దేశీ ప‌రిజ్ఞానంతో త‌యారు చేయ‌డం.. వంటివి..బ‌ల‌మైన సైనిక శ‌క్తి ఉన్న చైనా వంటి శ‌తృదేశాల విష‌యంలో ఏమ‌రుపాటుగా ఉన్నామ‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. గ‌త కొన్నాళ్లుగా ఇదే చ‌ర్చ జ‌రుగుతోంది. అయిన‌ప్ప‌టికీ.. మోడీ స‌ర్కారు ఎక్క‌డా ఈ వ్యాఖ్య‌ల‌ను ప‌ట్టించుకోవ‌డం లేదు.

తాజాగా దేశ ర‌క్ష‌ణ రంగంలో మేకిన్ ఇండియా ఆయుధాల వినియోగం.. వ‌స్తు త‌యారీ.. వంటివాటిపై ఒక నివేదిక వెల్ల‌డైంది. బ్లూంబ‌ర్గ్ సంస్థ ప్ర‌చురించిన ఈ నివేదిక‌లో భార‌త ఆయుధ సంప‌త్తి బ‌ల‌హీనంగా ఉంద‌నే నిజాలు అంద‌రినీ విస్మ‌యానికి గురి చేస్తున్నాయి. పొరుగు దేశ‌మైన చైనా.. అత్య‌దిక బ‌లంగా ఉంది. పైకి మిత్ర‌దేశ‌మని క‌బుర్లు చెబుతున్నా.. గాల్వాన్ లోయ స‌హా.. నాగాలాండ్ వంటి ఈ శాన్య రాష్ట్రాల‌పై ఆధిప‌త్యం కోసం.. ప్ర‌య‌త్నిస్తున్న విష‌యం తెలిసిందే.

ఇక‌, భార‌త దాయాది దేశం పాకిస్థాన్ మ‌న‌కు ప్ర‌ధాన శ‌తృవు అయితే.. దీనికి చైనా ద‌న్నుగా నిలుస్తోంది. ఇలాంటి కీల‌క‌స‌మ‌యంలో భార‌త్‌.. చైనాకుదీటుగా ఆయుధాలను స‌మ‌కూర్చుకోవాల్సి ఉంది. కానీ, దేశీయంగా త‌యార‌వుతున్న మేకిన్ ఇండియా ఉత్ప‌త్తులు అంత సామ‌ర్థ్యంగా లేవ‌నేది.. ఈ నివేదిక చెబుతున్న మాట‌. పైగా.. ఆధునిక హెలికాప్ట‌ర్ల‌ను సైతం భార‌త్ త‌యారు చేసుకోలేక పోతోంద‌నే వాద‌న వినిపిస్తోంది.

ప్ర‌స్తుతం కేంద్ర ప్ర‌భుత్వ ల‌క్ష్యం మేర‌కు.. ఉత్పాదక రంగంలో కనీసం 30 నుంచి 60 శాతం వరకు దేశీయ వస్తువులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి. అయితే.. దీనిని సాధార‌ణ రంగాల‌కు విస్త‌రిస్తే.. ఎవ‌రికీ అభ్యంత‌రాలు ఉండేవికాదు.. కానీ, కీల‌క‌మైన  రక్షణరంగానికి కూడా విస్తరింపజేయడం వల్ల   ఇబ్బందులు వస్తున్నాయని ఈ నివేదిక స్ప‌ష్టం చేసింది. ఇంతకుముందు అలాంటి పరిమితులు లేవు. ఆయుధ సామాగ్రి లేదా ఇతర వస్తువులను కొనుగోలు చేయడానికి చేసే ఖర్చులో కొంత మొత్తాన్ని దేశీయ తయారీకి ఉపయోగించేవారు.

బ‌ల‌హీనం.. చైనాతో ఆయుధ సంపత్తితో  పోల్చుకుంటే భారత్ బలహీనంగా ఉందని తాజా నివేదిక పేర్కొంది. 2020లో లద్ధాక్‌ సమీపంలో వాస్తవాధీన రేఖ వద్ద గల గాల్వన్ లోయలో భారత్-చైనా సైన్యం మధ్య చోటు చేసుకున్న ఘర్షణల తరువాత సరిహద్దులను మరింత బలోపేతం చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంది. అయితే.. ఆదిశ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు అడుగులు ప‌డ‌లేద‌ని అంటున్నారు.   సరిహద్దు వెంబడి చైనా దురాక్రమణను అరికట్టడానికి అవసరమైన నిఘా ఉంచేలా హెలికాప్టర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ.. కేంద్రం అలా చేయలేకపోతోందని నివేదిక‌ తెలిపింది.

ఇప్ప‌టికీ.. సంప్ర‌దాయ బ‌ద్ధ‌మే! భారత సైన్యం మేకిన్ ఇండియా కింద రూపొందించిన కొన్ని రక్షణ వస్తువుల కొనుగోళ్లను పెంచినప్పటికీ, ఇంకా డీజిల్-ఎలక్ట్రిక్ జలాంతర్గాములు, ట్విన్-ఇంజిన్ ఫైటర్ల వంటి క్లిష్టమైన ప్లాట్‌ఫారాలను అభివృద్ధి చేయట్లేదని నివేదిక‌ తెలిపింది.  ఇవి కొన్ని ద‌శాబ్దాలుగా ఉన్నవేన‌ని వెల్ల‌డించింది. మ‌రోవైపు.. ఇత‌ర దేశాల  నుంచి  యుద్ధ విమానాలను కొనుగోలు చేయాడం నిలిపివేశారు. ఫలితంగా- రక్షణ రంగంలో అత్యాధునిక యుద్ధ సామాగ్రి, హెలికాప్టర్లు, యుద్ధ విమానాల కొర‌త వెంటాడుతుంద‌ని నిపుణులు పేర్కొంటున్నారు.  మొత్తంగా చూస్తే.. మేకిన్ ఇండియా అనేది ర‌క్ష‌ణ రంగాన్ని బ‌లోపేతం చేయ‌డం క‌న్నా.. భ‌విష్య‌త్తులో బ‌ల‌హీన ప‌రిచే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని అంటున్నారు. మ‌రి మోడీ స‌ర్కారు.. ఏం చేస్తుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News