బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ సర్కారును ఇరకాటంలో పడేస్తున్న రాఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించిన ఎపిసోడ్ మరో మలుపు తిరిగింది. ఈ డీల్ కు దస్తావేజులు గోవా సీఎం మనోహర్ పారికర్ బెడ్ రూమ్ లో ఉన్నాయని ఆ రాష్ట్ర మంత్రి విశ్వజిత్ రాణే ఓ ఫోన్ కాల్ లో వెల్లడించినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దానికి సంబంధించిన ఆడియోను కూడా కాంగ్రెస్ పార్టీ రిలీజ్ చేసింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ ప్రతినిధి సుర్జేవాలా ఇవాళ మీడియాతో వెల్లడించారు. పారికర్ మాటల్లో నిజం ఉందని - ప్రధాని మోడీ దీనికి సమాధానం ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
36 రాఫేల్ విమానాల కోసం ఫ్రాన్స్ తో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. అయితే వాటి తయారీని రిలయన్స్ డిఫెన్స్ సంస్థకు అప్పగించింది. ఆ డీల్ లో భారీ కుంభకోణం జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. దీనికి కొనసాగింపుగా తాజాగా సుర్జేవాలా ఆరోపణలు చేస్తూ ``గతవారం జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో.. రాఫేల్ ఫైల్స్ గురించి పారికర్ ప్రస్తావించారని, అవి తన బెడ్ రూమ్ లో ఉన్నట్లు చెప్పారని మంత్రి రాణే తెలిపారు. ఓ వ్యక్తితో ఫోన్లో మాట్లాడుతూ మంత్రి ఈ విషయాన్ని వెల్లడించారు. రాఫేల్ డీల్ కు సంబంధించిన సీక్రెట్లు పారికర్ వద్ద ఉన్నాయి కాబట్టే ఆయన ఆరోగ్యం సరిగా లేకున్నా సీఎం పదవి నుంచి తొలగించడం లేదు` అని ఆరోపించారు.
మరోవైపు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడుతూ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. పారిశ్రామిక వేత్త అనీల్ అంబానీకి ప్రయోజనం కల్పించేందుకే రాఫెల్ డీల్ లో మార్పులు చేశారని ఆరోపించారు. ``పార్లమెంట్ లో సమాధానం చెప్పడానికి ప్రధాని నరేంద్ర మోడీ ముందుకు రారు. రక్షణ మంత్రి కూడా సమాధానం చెప్పరు. ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మాట్లాడాల్సిన దుస్థితి నెలకొంది. ఖాళీ విమానానికి.. ఫుల్లీ లోడెడ్ విమానానికి మధ్య కాంగ్రెస్ కు తేడా తెలీదని జైట్లీ అంటున్నారు. రాఫెల్ ఒప్పందంపై మోడీతో చర్చకు సిద్ధంగా ఉన్నాం. రాఫెల్ పై మాట్లాడే దమ్ము ప్రధానికి లేదు. మోడీతో ముఖాముఖి మాట్లాడానికి నేను సిద్ధం. రాఫెల్ డీల్ పై దర్యాప్తు చేయవద్దని సుప్రీం కోర్టు చెప్పలేదు. జేపీసీ వేయవద్దని కూడా సుప్రీం చెప్పలేదు. వాస్తవాలు దేశానికి తెలియాలి. రాఫెల్ ఒప్పందం దేశంలో కనీవినీ ఎరగనీ అవినీతి. దేశానికి మోడీ కాపలాదారు కాదు.. దొంగే. సైన్యం పేరు చెప్పి.. భావోద్వేగాలు ఎంతోకాలం రెచ్చగొట్టలేరు`` అని రాహుల్ మండిపడ్డారు.
Full View