పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు చాలా హాట్ హాట్ గా ఉండబోతున్నాయి. దేశంలోని చాలా ప్రతిపక్షాలు పెగాసస్ స్పైవేర్ ఉపయోగించటంపై రచ్చ చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇదే సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు మాత్రం రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పార్లమెంటులో గోల చేయడానికి రెడీ అయిపోతున్నారు. వీళ్ళ గోలంతా టార్గెట్ నరేంద్ర మోడీ గానే ఉండబోతోందని సమాచారం. రాష్ట్ర ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం కలిగిస్తున్న ఇబ్బందులను ఎండగట్టాలని కేసీఆర్ తన ఎంపీలను ఆదేశించారు.
ఇదే విషయమై ఆదివారం ఎంపీలతో కేసీఆర్ సుదీర్ఘమై భేటీ జరిపారు. తెలంగాణ ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం మొదటినుండీ వ్యతిరేకంగానే పనిచేస్తున్న విషయాన్ని స్పష్టంగా చెప్పారు. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన ప్రయోజనాలేమిటి ? ఏ ఏ అంశాలపై కేంద్రం తెలంగాణాను ఇబ్బందులు పెడుతోందనే విషయాలపై ఎంపీలందరికీ డిటైల్డ్ గా ఒక నోట్ అందించారు. ఆ నోట్ ఆధారంగానే ఎంపీలంతా పార్లమెంటులో మాట్లాడాలని చెప్పారు.
నిజానికి ఇపుడు పార్లమెంటులో మాటలకన్నా ఫైటింగులే ఎక్కువగా జరుగుతున్నాయి. రాష్ట్రాలకు తగ్గట్లే కేంద్రం కూడా వ్యవహరిస్తోంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణా, ఏపీ లాంటి రాష్ట్రాల ప్రయోజనాలను కేంద్రం ఉద్దేశ్యపూర్వకంగానే కాలరాస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆయా ఎంపీలు ఎంత మొత్తుకుంటున్నా కేంద్రం కనీసం లెక్క కూడా చేయటంలేదు. దీనివల్లే కేంద్రంతో రాష్ట్రాలకు నిత్యం ఘర్షణ వాతావరణమే ఉంటోంది.
బీజేపీయేతర రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్ధిరపరచటం కోసం బీజేపీ నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. తెలంగాణా, ఏపీ, పశ్చిమబెంగాల్లో ప్రతి రోజు జరుగుతున్న రచ్చే తాజా ఉదాహరణలు. రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన కేంద్రం దానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. దీనికితోడు రాష్ట్రాల్లో ఏదో ఒక గోల చేస్తూ నానా రచ్చ రచ్చ చేస్తోంది. మొత్తానికి తెలంగాణా ఎంపీలు పార్లమెంటులో ఏ స్ధాయిలో రచ్చ చేయబోతున్నారో అందరూ చూడవచ్చు. బహుశా కేంద్రంపై నూరుశాతం వ్యతిరేకత స్టాండ్ తీసుకున్న విషయం కరెక్టేనా ? కేసీయార్ ను నమ్మచ్చా ?