ఏపీలో ప్రజాప్రతినిధులకు కరోనా కలకలం రేపుతోంది. ఈరోజు ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వైసీపీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి కరోనా బారినపడ్డారు. ఇక కొద్దిసేపటి క్రితమే కడప ఎంపీ అవినాష్ రెడ్డి కి కూడా కరోనా పాజిటివ్ గా తేలిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి.
వైఎస్ వర్థంతి సందర్భంగా సెప్టెంబర్ 1, 2వ తేదీలలో కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో పాల్గొనే ప్రజాప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కరోనా పరీక్షలు చేస్తున్నారు.
ఈ పరీక్షల్లో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కరోనా కారణంగా ఎంపీ అవినాష్ రెడ్డి హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.
కాగా అవినాష్ రెడ్డికి కరోనా అన్న వార్తలపై ఆయన అధికారికంగా స్పందించలేదు. ప్రభుత్వం నుంచి కూడా స్పందన రాలేదు.