పవన్ జగన్ కంటే సీనియరా... అందుకే టార్గెట్...?

Update: 2022-12-30 09:35 GMT
రాజకీయాల్లో చూస్తే నేనే సీనియర్ మోస్ట్ లీడర్ అని టీడీపీ అధినేత నారా చంద్రబాబు గర్జిస్తారు. ఆయన రాజకీయ జీవితం నాలుగున్నర దశాబ్దాలు. అంతటి లాంగ్ రన్ పొలిటీషియన్ తెలుగు రాష్ట్రాలలో మరొకరు లేరనే చెప్పాలి. ఇక తరువాత తరంలో జగన్ ఇది పుష్కర కాలం రాజకీయం అని లెక్క వేసుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ది పద్నాలుగేళ్ల రాజకీయమా. అంటే ఆయన జగన్ కంటే పొలిటికల్ గా సీనియరా. ఆ సంగతి ఇండైరెక్ట్ గా జగనే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది మరి.

నర్శీపట్నం మీటింగులో జగన్ షరా మామూలుగా చంద్రబాబుని, పవన్ని కలిపి విమర్శించారు. ఈ సందర్భంగా పవన్ ది పద్నాలుగేళ్ల రాజకీయమని లెక్క తీసి మరీ చెప్పారు. పవన్ పేరు ప్రస్తావించకుండా ఒకాయన ఉన్నారు ఆయన రాజకీయాల్లోకి వచ్చి పద్నాలుగేళ్ళు అయింది. ఆయన వెనక ఒక్క ఎమ్మెల్యే ఈ రోజుకీ లేరు. పైగా ఆయన రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్లా జనాలు ఓడించారు అంటూ జగన్ చెప్పుకొచ్చారు.

అంటే ఇన్నేళ్ళ పాటు రాజకీయాల్లో ఉన్నారు పవన్ తన కంటే సీనియర్ అని చెప్పడం జగన్ ఉద్దేశ్యం కాదు ఇక్కడ అనుకోవాలి. తన కంటే ఒక ఏడాది ముందు ప్రజారాజ్యం నుంచి యువరాజ్యం నేతగా రాజకీయ ఎంట్రీ పవన్ ఇచ్చీఅ ఈ రోజుకీ ఆయన పొలిటికల్ గ్రాఫ్ చూస్తే నేలబారుడుగా ఉందని జనాలకు చెప్పడమే ఆయన మాటలలోని ఆంతర్యం అని అంటున్నారు.

అంటే పవన్ 2009, 2014, 2019 ఇలా మూడు ఎన్నికలను చూశారని, అన్ని చోట్లా ఆయనకు పరాభవమే మిగిలింది అని చెప్పడమూ మరో ఉద్దేశ్యమని అంటున్నారు. అంటే రాజకీయంగా పవన్ ఏమీ కాడని, ఆయన ప్రభావం ఏమీ లేదని జనాలకు చెప్పడం కోసమే జగన్ ఆయన రాజకీయ జీవితం ఎంత అనేది లెక్క చెప్పి మరీ జనం ముందు ఉంచారని అంటున్నారు.  అంతే కాదు ఆయన సొంతంగా రాజకీయాలు చేయడంలేదని, చంద్రబాబు ఎలా చెబితే ఆలా పవన్ యాక్ట్ చేస్టారు అంటూ రెండు పార్టీలు ఒక్కటే అన్న తన పాత రాజకీయ వ్యూహాన్ని తెరపైకి తెచ్చి మరీ విమర్శించారు.

మొత్తానికి చూస్తే పవన్ రాజకీయనగా నామమాత్రం అన్నది జనంలో ఎస్టాబ్లిష్ చేయడానికే జగన్ ఇలా ఆయన ఫ్లాష్ బ్యాక్ ని తీసి మరీ జనంలో చర్చకు పెట్టారు అంటున్నారు. నిజానికి చూస్తే నిఖార్సుగా ఓడింది 2019 ఎన్నికల్లోనే అని చెప్పాలి. 2009లో ఆయన ప్రజారాజ్యం తరఫున ప్రచారం చేశారు అంతే. ఆ పార్టీ ఓటమిలో పవన్ పాత్ర ఉన్నా అది చాలా తక్కువ. ఇక 2014లో ఆయన జనసేనను స్థాపించినా పోటీ చేయలేదు. మరి ఆయన ప్రచారం చేసిన తెలుగుదేశం బీజేపీ గెలిచాయి. అంటే ఆ విధంగా పవన్ హిట్ అయినట్లే అనుకోవాలి కదా.

ఇక 2019లో ఆయన రెండు చోట్లా ఓడినా తన పార్టీ ఎమ్మెల్యే ఒకరు గెలిచారు. 2024కు ఆయన కొత్త వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. రాజకీయాలు ఎపుడూ ఒకేలా ఉండవు. అవి మారుతూ ఉంటాయి. ఆ మాటకు వస్తే తమిళనాడులఒ డీఎంకే ఏకంగా మూడు ఎన్నికలలో ఓడిపోయిన 14 ఏళ్ల పాటు విపక్షానికే పరిమితం అయింది. మరి ఆ పార్టీ తరువాత ఎన్నికల్లో గెలవలేదా. అందువల్ల రాజకీయాల్లో ఓటమి ప్రశ్నే కాదు అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ పవన్ గురించి విమర్శిస్తునే తన కంటే రాజకీయంగా సీనియర్ అని ఒప్పుకున్నారా అన్న చర్చ కూడా నడుస్తోంది మరి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News