పార్టీ వ‌దిలి ప‌బ్బుల వెంట తిరుగుతున్నావా రాహుల్ !

Update: 2022-05-03 06:30 GMT
కాంగ్రెస్ యువ నాయ‌కులు రాహుల్ గాంధీ నాయ‌క‌త్వం లోపం కార‌ణంగా ఆ పార్టీ ఎద‌గ‌డం లేదా ? అంటే అవున‌న్న‌ది కొన్ని వ‌ర్గాల స‌మాచారం. అందుకు తార్కాణంగా వ‌ర్త‌మాన పరిణామాలు నిలుస్తున్నాయి. ఆ విధంగా ఆ పార్టీలో ముస‌లం మాత్రం వ‌ద‌ల‌డం లేదు.

వ‌య‌స్సు మీరుతున్న పెద్ద‌ల కార‌ణంగా ఆ పార్టీకి ప‌రుగులు ఇక రావ‌డం లేదు. ఆ కార‌ణంగా ఆ పార్టీ నిండా మునిగిపోతోంది. పార్టీని సాహ‌సించి గాంధీయేత‌ర కుటుంబాల చేతిలో ఉంచ‌లేరు. ఓ విధంగా సోనియా గాంధీకి  అది కూడా క‌ష్ట‌మే ! గ‌తంలో పార్టీని అన్నీ తామై న‌డిపిన నేత‌లు ఇవాళ లేరు. వైఎస్సార్ లాంటి వీర విధేయులు లేరు.  

కొంద‌రి కార‌ణంగా యువ నాయ‌కులు కూడా పార్టీని వీడి బీజేపీ పంచ‌న చేరి బ‌ల‌మైన నాయ‌కులుగా ఎదిగి వస్తున్నారు. ద‌క్షిణాది రాష్ట్రాల‌కు సంబంధించి అస్స‌లు పార్టీకి ఉనికి లేనేలేదు. ఇక్క‌డ ఆ రోజు కాంగ్రెస్ ఏం చెబితే అది న‌డిచింది. కానీ ఇప్పుడు ఏం చెప్పినా కూడా న‌డ‌వ‌ని దుఃస్థితి లేదా దారుణమ‌యిన స్థితి నెల‌కొని ఉంది. దీంతో పార్టీకి జవం మ‌రియు జీవం నింపాల్సిన రాహుల్ మాత్రం బాధ్య‌తారాహిత్యంగానే ఉన్నారు.

తెలంగాణ‌లో పార్టీ లేదు. ఆంధ్రాలో పార్టీ లేదు. ఇంకా ఎక్క‌డ కూడా పార్టీ లేదు. అదేలేండి కాంగ్రెస్ పార్టీ అన్న‌దే లేదు. ఉన్న‌దంతా కేవ‌లం ఓ ఊహ మ‌రియు ఓ అపోహ మాత్ర‌మే! అయినా కూడా కాంగ్రెస్ పార్టీని బ‌తికించే శ‌క్తులు కొన్నే ఉన్నాయి అని అనుకున్నా అది కూడా లాభం లేకుండా పోయింది.

త్వ‌ర‌లో కాంగ్రెస్ పార్టీ గూటికి ప్ర‌శాంత్ కిశోర్ అనే పొలిటిక‌ల్ స్ట్రాట‌జిస్ట్ చేరుతార‌ని వార్త‌లు, సంబంధిన వివ‌రం మీడియా అందించినా అదంతా అబ‌ద్ధ‌మేన‌ని తేలిపోయింది. ఇక‌పై ఆయ‌న సొంతంగానే త‌న మార్కు రాజ‌కీయం న‌డుపుకోవాల‌ని భావిస్తున్నారు.

అందుకే కాంగ్రెస్ డీలా ప‌డిపోయింది. రాహుల్ గాంధీ కూడా డీలా ప‌డిపోయి పార్టీ క‌ల్చ‌ర్ లో మునిగి తేలుతున్నార‌ని వీడియోలు చెబుతున్నాయి. కెమెరా సాక్షిగా రాహుల్ గాంధీ ఆనందాలు మ‌రియు న‌వ్వులు ప్ర‌త్య‌క్షం అయి ఉన్నాయి క‌నుక దృశ్య సంబంధ ఆధారాల‌ను న‌మ్మినా న‌మ్మ‌కున్నా ఇదే నిజం.
Tags:    

Similar News