తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేసి తన సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న దివంగత సీఎం వైఎస్ షర్మిల ఈ మేరకు పలు కార్యక్రమాలతో ప్రజలతో అనుసంధానం అవుతున్న సంగతి తెలిసిందే. కష్టాల్లో ఉన్న వారిని పరామర్శించడం ద్వారా షర్మిల ప్రజల్లోకి వెళుతున్నారు ముఖయంగా నిరుద్యోగులపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు షర్మిల. అయితే, ఇన్నాళ్లు లైట్ తీసుకున్నప్పటికీ ఇప్పుడు గేమ్ మార్చాలని టీఆర్ఎస్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
ఉద్యోగాల నోటిఫికేషన్ల విషయంలో యువత అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని షర్మిల భావిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో సీఎం కేసీఆర్ ఇలాకా అయిన గజ్వేల్ లో ఓ యువకుడి కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం చేశారు. తాజాగా అదే ఒరవడిలో సూర్యపేట జిల్లా మేడారం గ్రామంలో ఇటీవల ఉద్యోగం రాలేదని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన నీలకంఠం సాయిని పరామర్శించాలని భావించారు. అయితే షర్మిల వస్తున్నట్లు ముందస్తు సమాచారం ఉన్నా.. నీలకంఠం సాయి కుటుంబం ఇంటికి తాళం వేసి వెళ్లారు. దీంతో షాక్ తిన్న షర్మిల.. తాళం వేసిన సాయి ఇంటి ముందే నిరుద్యోగులతో ముఖాముఖి నిర్వహించింది. వారి సమస్యలను తెలుసుకున్నారు. అయితే షర్మిల వస్తుందనే టీఆర్ఎస్ నేతలు వారి కుటుంబాన్ని దాచిపెట్టారని షర్మిల అనుచరుడు పిట్ట రాంరెడ్డి ఆరోపించారు.
అయితే, గతంలో షర్మిల టూర్‌పై సీరియస్‌గా స్పందించని టీఆర్ఎస్ తాజాగా మాత్రం ఒకింత ఘాటుగానే రియాక్టయింది. షర్మిలమ్మ, మీ కుయుక్తులు, డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరు అని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి అన్నారు. మేడారంలో నిరుద్యోగి కనపడకుండా పోవడం ఆయన్ను తానే కిడ్నాప్ చేయించాడాని చెప్పడం విడ్డూరంగా ఉందని శానంపూడి సైదిరెడ్డి మండిపడ్డారు. తెలంగాణ ఆత్మగౌరవం అనే నినాదంపై రాష్ట్రం ఏర్పడిందని, ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారన్నారన్న సైదిరెడ్డి.. మీరు ఉద్దరించేది ఇక్కడ ఏమి లేదని మండిపడ్డారు.