సీఎస్ గా శ్రీలక్ష్మి... జగన్ మార్క్ ప్రమోషన్...?

Update: 2022-11-12 09:02 GMT
ఏపీ ప్రభుత్వంలో మునిసిపల్ శాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న శ్రీలక్ష్మి కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అవుతారా.  అంటే జరుగుతున్న ప్రచారం బట్టి చూస్తే అవును అనే మాట వస్తోంది. శ్రీలక్ష్మి సీనియర్ అధికారిణి. ఆమె 1988 బ్యాచ్ కి చెందిన మహిళా ఐఏఎస్ అధికారిణి. ఆమె ఉమ్మడి ఏపీలో గనుల శాఖ కార్యదర్శిగా వైఎస్సార్ హయాంలో పనిచేశారు.

ఆ టైం లోనే ఓబులాపురం గనుల స్కాం లో ఆమె పేరు సీబీఐ చేర్చడంతో ఏడాది పాటు జైలు పాలు అయ్యారు. ఆ మీదట ఆమె తిరిగి విధులలోకి వచ్చారు. రాష్ట్రం విడిపోయాక ఆమె  తెలంగాణా ప్రభుత్వంలో అధికారిణిగా ఉన్నా ఏపీలో పోస్టింగ్ కోసం దరఖాస్తు చేసుకుని ఈ వైపు వచ్చారు. ఇక జగన్ సర్కార్ లో ఆమెకు ప్రాధాన్యత ఎక్కువగా ఉంది.

దాంతో ఆమె ఇపుడు కీలకమైన మునిసిపల్ శాఖలో ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెలలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పదవీ విరమణ చేయనుండడంతో ఆయన ప్లేస్ ని భర్తీ చేయడానికి శ్రీలక్ష్మికి చాన్స్ ఇస్తారు అని ప్రచారం సాగుతోంది.

శ్రీలక్ష్మి కంటే కూడా సీనియర్ అధికారులు ఇద్దరు ఉన్నారు. అందులో 1987 బ్యాచ్ కి చెందిన నీరభ్ కుమార్ ప్రసాద్‌తో  1988 బ్యాచ్ కి చెందిన అధికారిణి పూనం మాలకొండయ్య ఒకరు. అయితే జగన్ సర్కార్ మాత్రం శ్రీలక్ష్మి ని సీఎస్ గా చేయడానికి మొగ్గు చూపుతోంది అని తెలుస్తోంది.

ఆమె ఓబులాపురం మైనింగ్ కంపెనీ నుంచి ముడుపులు తీసుకున్నారు అన్న కేసులో సీబీఐ నుంచి ఎదుర్కొంటున్న ఆరోపణలు కేసుల వల్ల ఇంతకాలం ఇబ్బందులు పడ్డారు.

ఇపుడు తెలంగాణా హై కోర్టు క్లీన్ చీట్ ఇవ్వడంతో ఆమె బయట పడ్డారు. ఈ నేపధ్యంలో ఏపీ కొత్త సీఈస్ గా ఆమెను చూడవచ్చు అని అంటున్నారు. చూడాలి మరి కొద్ది రోజులలో ఈ సంగతి ఏంటి అన్నది తెలుస్తుంది. ఏది ఎలాగున్నా నూటికి తొంబై శాతం శ్రీలక్ష్మి కొత్త సీఎస్ అని వినిపిస్తున్న మాట.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News