మునుగోడు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీ చేయాలా వద్దా అనే విషయంలో తెలుగుదేశం పార్టీ ఎటూ తేల్చుకోలేకపోతోంది. ఇదే విషయమై తెలంగాణాలోని సీనియర్ నేతలతో చంద్రబాబు నాయుడు చాలా సేపు సమావేశమయ్యారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశాలు జరిపినా ఏ విషయాన్ని తేల్చుకోలేకపోతున్నారు. తెలంగాణా టీడీపీలో మళ్ళీ పునరుత్తేజం నింపాలని చంద్రబాబు అనుకుంటున్నా అందుకు తగ్గ మార్గమే కనబడటం లేదు. ఇపుడు అధికారపార్టీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ బలంగానే కనబడుతున్నాయి.
వీటి మధ్య టీడీపీ ఎంతవరకు నిలదొక్కుకోగలదు ? అనేదే చంద్రబాబు సందేహం. రాష్ట్ర విభజన తర్వాత బలహీనపడిపోయిన టీడీపీని మళ్ళీ లేపాలంటే చాలా కష్టపడాల్సిందే. ఇదే సమయంలో రాబోయే ఎన్నికలు పెద్ద అవరోధంగా మారబోతున్నాయి. ఏకకాలంలో రెండు రాష్ట్రాల్లో ను దృష్టి పెట్టాలంటే చంద్రబాబుకు కష్టంగా మారింది. ఇందుకనే తెలంగాణలో పార్టీ వ్యవహారాలను పూర్తిగా లోకల్ నేతలకే వదిలేశారు. ఇపుడు మునుగోడు ఉప ఎన్నికల విషయమై జరిగిన చర్చలో పోటీ చేయాల్సిందే అని తమ్ముళ్లు గట్టిగా పట్టుపట్టారు.
టీడీపీ పోటీచేయాలని తమ్ముళ్ళు పట్టపట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే బీసీ ఫ్యాక్టరే. మునుగోడు ఓటర్లలో 60 శాతం బీసీలే. అలాంటి మూడు ప్రధాన పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు రెడ్లే. ఇక్కడే తమ్ముళ్ళల్లో ఒక ఆలోచన పెరిగిపోతోంది. టీడీపీ తరపున గట్టి బీసీ నేతలను రంగంలోకి దింపితే బీసీల ఓట్లన్నీ పడతాయని అనుకుంటున్నారు. పోటీలోకి దిగటానికి నియోజకవర్గ ఇన్చార్జి జక్కిలి ఐలయ్య యాదవ్ కూడా రెడీగా ఉన్నారు.
చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటమే ఆలస్యం నామినేషన్ వేయటానికి ఐలయ్య అన్నీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక్కడ చంద్రబాబు ఎందుకనో ముందువెనకా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు గనుక టీడీపీ బీసీ నేతను అభ్యర్ధిగా ప్రకటించి పోటీలోకి దిగితే నిజమైన బీసీల పార్టీ టీడీపీయే అన్న విషయం జనాల్లోకి బాగా వెళుతుందని తమ్ముళ్ళంతా చెబుతున్నారు. దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకున్ని రాబోయే జనరల్ ఎలక్షన్స్ లో టీడీపీ సత్తా చాటచ్చన్నది తమ్ముళ్ళ ఆలోచన. మరి చంద్రబాబు ఏమంటారో చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.