ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు కొత్త పీయార్సీ వద్దు అనే ఆందోళన చేస్తున్నారు. మాకు వద్దు మహా ప్రభో కొత్త జీతాలు, కొత్త పే స్కేల్స్, మాకు పాత జీతాలే ముద్దు, ముందు అవి ఇప్పించండి చాలు బాబూ అంటూ వారు గత కొన్ని రోజులుగా నిరసనలు చేస్తున్నారు. ఆందోళన బాటలో ఉన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి సమ్మె బాట పడుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం కొత్త పీయార్సీ ద్వారా మీకు జీతాలు పెరుగుతాయని చెబుతోంది. అందుకే పట్టుబట్టి మరీ ఆదివారం సెలవు రోజు కూడా ట్రెజరీలను తెరిపించి ఉద్యోగుల చేత పని చేయించింది.
కొత్త పే రివిజన్ మేరకే పే స్లిప్స్ తయారు చేయాలని, అలగే జీతాలు ఉద్యోగులు, పెన్షనర్ల ఖాతాలలో వేయాలని హుకుం జారీ చేసింది. దాని ప్రకారం పెన్షనర్లకు ఫస్ట్ తేదీన పెన్షన్ వచ్చింది. అలాగే ఉద్యోగులకు కూడా అదే తీరున కొత్త పీయార్సీని అమలు చేస్తోంది. పైగా ఆర్ధిక శాఖ తరఫున మెసేజెస్ కూడా అందరికీ వెళ్తున్నాయి. మీ కొత్త పే స్లిప్స్ ని చూసుకోండి అని కూడా అందులో సందేశం ఇస్తున్నారు.
మొత్తానికి ప్రభుత్వం తాను అనుకున్నట్లుగానే ముందుకు వెళ్తోంది. ఇక ఉద్యోగులు కొంత దిగి వచ్చి ప్రభుత్వంతో చర్చలకు కూర్చున్నాక కూడా ప్రభుత్వ ప్రతినిధుల నుంచి ఇదే రకమైన జవాబు వచ్చింది అంటున్నారు. దీని మీద ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే కొత్త పీయార్సీ మీద జారీ చేసిన జీవోలను అసలు వెనక్కు తీసుకునే ప్రసక్తి లేదని కూడా చెప్పేశారు.
కొత్త పీయార్సీ ప్రకారమే జీతాలు పడిపోయాయని కాబట్టి ఉద్యోగుల డిమాండ్ ఇక చెల్లదని కూడా ఆయన అంటున్నారు. అందువల్ల ఇది తప్ప మిగిలిన వాటి మీదనే చర్చించమంటున్నారు. మరో వైపు ఉద్యోగులకు ఐ ఆర్ విషయంలో గతంలో 27 శాతం నుంచి 23 శాతం ఫిట్మెంట్ తేడాను రికవరీగా వసూల్ చేస్తున్నారు అన్నది ఉద్యోగుల మరో ఆవేదన.
దాని మీద కూడా సజ్జల మాట్లాడుతూ రికవరీ కాదు అది రీ అడ్జస్ట్మెంట్ అని కొత్త పేరు పెట్టి చెబుతున్నారు. ఇక ఆశుతోష్ టీ నివేదికను బయటపెట్టడం మీద కూడా ఆయన మాట్లాడుతూ నివేదిక ఇస్తే అంతా అయిపోతుందా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి ఉద్యోగులు సమ్మె విరమించాలని ప్రభుత్వం కోరుతోంది. ఏమినా ఉంటే సర్దుబాటు చేసుకుందామని చెబుతోంది. మరి ఉద్యోగులు కొత్త పీయార్సీవే వద్దు అంటున్నారు, కానీ సర్కార్ అది అమలు అయిపోయింది అంటోంది. మొత్తానికి చూస్తే కొత్త పీయార్సీ అమలు అయిపోతే మరి చర్చలు ఎందుకు, ఆ మీదట ఆందోళన కూడా ఎందుకూ, మొత్తానికి ఉద్యోగులకు ఇదంతా అయోమయంగా ఉంది అంటే తప్పు లేదేమో.