యుద్ధం కీలకదశకు చేరుకున్నదా?

Update: 2022-06-14 05:01 GMT
దాదాపు నాలుగు నెలలుగా ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం కీలకదశకు చేరుకున్నదా ? అవుననే అంటున్నారు నిపుణులు. రష్యా దళాలు ఉక్రెయిన్లోని కీలకప్రాంతాల్లో ఒకటైన డాన్ బాస్ కమ్ముకుంటున్నాయి. అన్నీవైపుల నుండి రష్యాసైన్యం దాన్ బాస్ వైపు కదులుతున్నాయి. దాన్ బాస్ ను గనుక స్వాధీనం చేసుకోగలిగితే ఉక్రెయిన్ యుద్ధాన్ని రష్యా దాదాపు గెలిచినట్లే అనుకోవాలి. దేశంలోని ఉన్న కీలకమైన పరిశ్రమలు, గనుల్లో అత్యధికం దాన్ బాస్ లోనే ఉన్నాయి.

దీన్నిబట్టే ఈ నగరం ఉక్రెయిన్ కు ఎంతటి కీలకమో అర్ధమవుతోంది. అలాగే అంతర్జాతీయస్ధాయిలో సముద్రవ్యాపారానికి కూడా డాన్ బాస్ అత్యంత కీలకమైన ప్రాంతం. ఈ నగరాన్ని గనుక రష్యా స్వాధీనం చేసుకుంటే తీరప్రాంత వ్యాపారంతో ఉక్రెయిన్ కు విదేశాలతో సంబంధాలు దాదాపు తెగిపోయినట్లే అనుకోవాలి. డాన్ బాస్ ను స్వాధీనంచేసుకునేందుకు రష్యా ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ దళాలు విరుచుకుపడుతున్నాయి.

గతంలో కీవ్, ఖర్కీవ్ నగరాలపై యుద్ధంచేసినపుడు రష్యా సరైన ప్రణాళిక లేకుండా కోఆర్డినేషన్ లేకుండానే వెళ్ళాయి. దానివల్ల పై నగరాలను స్వాధీనంచేసుకోవటంలో రష్యా ఫెయిలైంది.

అందుకనే ఆ అనుభవాలతో ఇపుడు డాన్ బాస్ ను స్వాధీనంచేసుకోవాలన్న టార్గెట్ తో పావులు కదుపుతోంది. వారంరోజుల్లో ఏ సంగతి తేలిపోయేట్లే ఉంది. డాన్ బాస్ ను గనుక రష్యా స్వాధీనం చేసుకోగలిగితే కీవ్, ఖర్కీవ్ నగరాలను ఆక్రమించుకోవటం పెద్ద కష్టమేమీకాదు.

నాలుగునెలల యుద్ధంలో ఉక్రెయిన్ లోని అనేక నగరాలు దాదాపు నేలమట్టమైపోయాయి. లక్షల కోట్లరూపాయల విలువైన ఆస్తులు నాశనమైపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ఆసుపత్రులు, విద్యాసంస్ధలు, జనావాసాలు, షాపింగ్ మాల్స్, పరిశ్రమలు నాశనమైపోయాయి. యుద్ధం తర్వాత ఎవరు విజేతలు, ఎవరు పరాజితులన్నది పక్కనపెడితే శిధిలమైన నగరాలతో కూడిన ఉక్రెయిన్ను స్వాధీనం చేసుకుని రష్యా మాత్రం చేయగలిగేది ఏమీ ఉండదు.

ఉక్రెయిన్ పునర్నిర్మాణానికి కనీసం పదేళ్ళు పడుతుందని నిపుణులు గతంలోనే అంచనా వేశారు. అదికూడా ప్రపంచదేశాలన్నీ సాయం అందిస్తేనే. ఒక్క రష్యామాత్రమే పునర్నిర్మించాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుందో చెప్పలేం.
Tags:    

Similar News