కరోనా నెగెటీవ్ ఉన్నా వైరస్ ఉన్నట్టేనా? పూటకో మాట చెబుతున్న సైంటిస్టులు
కరోనాపై రోజురోజుకూ వస్తున్న అధ్యయనాలు, సర్వేలు చూస్తుంటే ప్రజలకు పిచ్చెక్కుతున్నది. కరోనా నెగెటీవ్ ఉన్నంత మాత్రాన.. కరోనా వైరస్ లేనట్టు కాదని.. కరోనా లక్షణాలు తీవ్రంగా ఉంటే పాజిటివ్ రోగుల లాగే వీళ్లు కూడా వైద్యం తీసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.
ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నపాటి లక్షణాలు ఉన్నా కొందరు కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. ఒక్కోసారి కరోనా లక్షణాలు తీవ్రంగా ఉన్నవారికి కూడా రిజల్ట్ నెగెటివ్ వస్తుంది. కానీ నెగటివ్ వచ్చినా ప్రతిసారి మనం నమ్మొద్దని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొవిడ్ ప్రారంభదశలో ఉన్నప్పుడు చాలా మందికి నెగిటివ్ చూపిస్తున్నదని.. మరో రెండు రోజుల తర్వాత పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ చూపిస్తున్నదని వైద్యులు చెబుతున్నారు. దీంతో వైద్యుల్లోనూ అటు రోగుల్లోనూ తీవ్ర అయోమయం నెలకొన్నది.
వైరస్ సోకినా, సోకినట్లు తెలియదు. వారి బాడీలో యాంటీ బాడీస్ ఉన్న ఉన్నట్లు తెలియదు. అలాగే, ఫాల్స్ పాజిటివ్ కూడా ఇన్‌కరెక్ట్ రిజల్ట్‌ని చూపిస్తుంది. ఇన్‌ఫెక్షన్ ఉన్నా లేనట్లు తెలుస్తుంది. యాంటీ బాడీస్ ఉన్నా లేనట్లు కనపడుతుంది. కొన్ని స్టడీస్ ప్రకారం కొవిడ్ సోకిన నాలుగు రోజుల లోపు టెస్ట్ చేస్తే, వారికి వైరస్ సోకినా కూడా, 67% మందికి టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వస్తోందని తెలుస్తోంది. లక్షణాలు కనపడిన మూడు రోజుల తరువాత కూడా ఫాల్స్ నెగటివ్ వచ్చే ఛాన్స్ ఉంది అని డాక్టర్లు చెబుతున్నారు. కొవిడ్ హాట్ స్పాట్ లో సింప్టంస్ తో ఉన్న వ్యక్తికి టెస్ట్ రిజల్ట్ నెగటివ్ వచ్చినా కూదా పాజిటివ్ గానే భావించి ఐసొలేషన్ లో ఉండడం మంచిదనీ, పెద్దగా కొవిడ్-19 కేసులు లేని చోట సింప్టంస్ లేని వ్యక్తికి టెస్ట్ రిజల్ట్స్ నెగటివ్ వస్తే నెగటివ్ అనే అనుకోవచ్చనీ డాక్టర్లు చెబుతున్నారు.