కరోనా కలకలం .. వైరస్ వ్యాప్తికి కారణం ఇవేనా!

Update: 2021-04-24 02:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్ర ఉగ్రరూపం దాల్చింది. గత రెండు రోజులుగా ప్రపంచంలోనే ఇప్పటివరకు ఏ దేశంలో కూడా  24 గంటల్లో నమోదు కానటువంటి కేసులు నమోదు అయ్యాయి. గత 3 రోజులుగా దేశంలో మొత్తం నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షలు పైమాటే. ఇక సెకండ్ వేవ్ లో వైరస్ వ్యాప్తి చాలా వేగంగా ఉండటంతో కొన్ని రోజుల్లోనే భారీగా కేసులు పెరిగిపోయాయి. చాలా రాష్ట్రాల్లో కరోనా బాధితులకి ఆస్పత్రుల్లో బెడ్స్ కూడా లేకా అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. ముఖ్యంగా దేశంలో ఆక్సిజన్ కొరత చాలా ఉంది. ఆక్సిజన్ సరైన సమయానికి అందక కూడా కొందరు మృత్యువాత పడుతున్నారు.

ఇకపోతే , కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఎక్కువగా సంఖ్యలో నమోదవుతున్న సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత  వేగవంతం చేశారు.  అయితే, కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కరోనా వ్యాప్తి మాత్రం ఆగడం లేదు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి మాస్క్ ధరించాలని, భౌతిక దూరం పాటించాలని చెప్తున్నా కరోనాను కట్టడి చేయలేకపోతున్నారు. కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ కొంతమంది బయట కరోనా నియమాలని పాటించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. మరికొందరు తప్పనిసరి పరిస్థితుల్లో పూట గడిచేందుకు మార్గం లేకపోవడంతో బయట తిరగాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.  ఫలితంగా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందుతోంది.  కొంతమంది కావాలని బయట తిరుగుతుండటంతో కేసులు భారీగా పెరుగుతున్నాయి. అలాగే కొన్ని సందర్భాల్లో కరోనా పాజిటివ్ అని తెలియక ఇతరులతో కలిసినప్పుడు ఒకరి నుండి మరొకరికి వైరస్ అనేది వ్యాప్తి చెందుతుంది. బయటకు వెళ్లిన వ్యక్తులు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. అలాగే మొఖానికి మాస్క్ ధరించడంతో పాటుగా శానిటైజర్ ను వినియోగించాలి.  కనీసం ప్రతి అరగంటకు ఒకసారి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.  అప్పుడే కరోనాకు కొంతమేర చెక్ పెట్టె అవకాశం ఉంది.
Tags:    

Similar News