3 రాజధానులు: జగన్ కు వెంకయ్య సపోర్ట్.?

Update: 2019-12-24 09:29 GMT
భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పరోక్షంగా ఏపీ సీఎం జగన్ కు మద్దతునిచ్చే మాటలే మాట్లాడారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లి గూడెం నీట్ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న వెంకయ్యనాయుడు భారతదేశం లో అభివృద్ధి వికేంద్రీకరణ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని.. పట్టణాల నుంచి గ్రామ స్థాయి అభివృద్ధి జరగాలని కోరారు.

ఏపీలో పర్యటిస్తూ వెంకయ్య అభివృద్ధి వికేంద్రీకరణ గురించి మాట్లాడడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఏపీకి 3 రాజధానులు అవసరం అంటూ ఏపీ సీఎం జగన్ కొద్ది రోజుల కిందటే ప్రకటించిన సంగతి తెలిసిందే.. దీనిపై బీజేపీ నేతలు జీవీఎల్, పురంధేశ్వరి లు మద్దతు గా మాట్లాడారు.

ఇప్పుడు అదే తాను ముక్క అయిన మన ఉపరాష్ట్రపతి వెంకయ్య తాజాగా ఏపీ పర్యటన లో జగన్ మూడు రాజధానులు, అభివృద్ధి వికేంద్రీకరణానికి మద్దతిచ్చేలా వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది.

దీన్ని బట్టి ఏపీ సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ కోసం 3 రాజధానుల నిర్ణయానికి వెంకయ్య మద్దతునిచ్చేనట్టే కనిపిస్తోంది.దీన్ని బట్టి జగన్ నిర్ణయానికి బీజేపీ మద్దతు ఉందనే అర్థమవుతోంది. 3 రాజధానులకు వ్యతిరేకం గా పోరాడుతున్న టీడీపీ నేతలకు ఈ వ్యాఖ్యలు శరాఘాతం గా మారాయి.


Tags:    

Similar News